Dulquer Salman : లక్కి భాస్కర్ టైటిల్ ట్రాక్ విడుదల..
- శభాష్ సోదరా..కాలరెత్తి తిరగరా.. కరెన్సీ దేవి నిను వరించెరా
- లక్కీ భాస్కర్" టైటిల్ ట్రాక్ విడుదల
- సెప్టెంబర్ 7న రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
”లక్కీ భాస్కర్” సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, “శ్రీమతి గారు” గీతం విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ ట్రాక్ విడుదలైంది. జులై 28న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా “లక్కీ భాస్కర్” నుంచి టైటిల్ ట్రాక్‌ను చిత్ర బృందం ఆవిష్కరించింది. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మరోసారి తన కలం బలం చూపించారు. “శభాష్ సోదరా.. కాలరెత్తి తిరగరా.. కరెన్సీ దేవి నిను వరించెరా” అంటూ తనదైన సాహిత్యంతో గీతాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు. కథానాయకుడి పాత్రను ఆవిష్కరించడంతో పాటు, శ్రోతలలో స్ఫూర్తి నింపేలా సాహిత్యాన్ని అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ పాట కోసం 1980ల నాటి ఇండి-రాక్‌ని ప్రస్తుత తరానికి తగ్గట్టుగా స్వరపరిచారు. ఈ గీతం ప్రస్తుత గీతాలకు భిన్నంగా సరికొత్త అనుభూతిని ఇస్తుంది. వయసు, భాషతో సంబంధం లేకుండా సంగీత ప్రియులందరినీ ఆకట్టుకునేలా ఉంది.
1980-90 ల కాలంలో, అసాధారణ విజయాన్ని సాధించిన ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ యొక్క ప్రయాణాన్ని ”లక్కీ భాస్కర్” చిత్రంలో చూడబోతున్నాం. దుల్కర్ సల్మాన్ సినీ ప్రయాణంలో మరొక చిరస్మరణీయమైన చిత్రంలా నిలిచేలా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని మలుస్తున్నారు.
Also Read
- Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
- Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
- Peddi : వేట షురూ.. 'రాంబుజ్జి'గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
- Film Chamber Meeting : 'పెద్ది' సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
Also Read: Pawan Kalyan: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవర్ స్టార్ సినిమా అప్ డేట్..
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్‌ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్‌పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!