Dulquer Salmaan: ‘లక్కీ భాస్కర్’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్‌లో ఉన్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తన నెక్స్ట్ మూవీ విషయంలో ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. సాధారణంగా ఏ హీరో అయినా సరే స్టోరీ మొత్తం తన చుట్టూనే తిరగాలని, టైటిల్ క్యారెక్టర్ తనదే అయి ఉండాలని కోరుకుంటారు. కానీ పవన్ సాధినేని డైరెక్షన్లో వస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ విషయంలో మాత్రం దుల్కర్ ఈ రొటీన్ రూల్‌ను బ్రేక్ చేసేశారు. అసలు ఆ టైటిల్ రోల్ తనది కాకపోయినా ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు ఓకే చేశారో రీసెంట్ ప్రమోషనల్ ఈవెంట్లో ఓపెన్‌గా చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్‌తో కలిసి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత దుల్కర్ మాట్లాడుతూ.. “ఈ కథను నేను ‘లక్కీ భాస్కర్’ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే విన్నాను. అప్పటి నుంచే ఈ పాయింట్ నా మైండ్‌లో బలంగా ఉండిపోయింది. నిజం చెప్పాలంటే ‘ఆకాశంలో ఒక తార’ టైటిల్ చెప్పే ఆ మెయిన్ లీడ్ రోల్ నాది కాదు. సాత్విక వీరవల్లి ఆ పాత్రను చేస్తోంది. అయినా సరే నేను ఏమాత్రం ఆలోచించకుండా ఈ ప్రాజెక్ట్ చేశాను. ఎందుకంటే ఇది ప్రతి కూతురి ఆశలు, ఆకాంక్షల చుట్టూ తిరిగే కథ. లైఫ్‌లో ఏ ఫీల్డ్‌లోనైనా సరే అమ్మాయిలు తమ డ్రీమ్స్‌ను రీచ్ అవ్వగలరనే బలమైన కాన్ఫిడెన్స్‌ను ఈ మూవీ ఇస్తుంది. ప్రతి ఫ్యామిలీకి కచ్చితంగా కనెక్ట్ అవుతుంది” అని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో శృతి హాసన్ కూడా ఒక రోల్లో కనిపించనున్నారు.
ఇదే ఈవెంట్లో మాట్లాడిన మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ సినిమాపై భారీ హైప్ పెంచేశారు. గత ఐదేళ్లలో తాను విన్న ది బెస్ట్ స్క్రిప్ట్‌లలో ఇదొకటని చెప్పారు. ముఖ్యంగా మూవీ చివరి రీల్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొడుతున్నప్పుడు తీవ్రమైన భావోద్వేగంతో తన కళ్లలో నీళ్లు తిరిగాయని ఎమోషనల్ అయ్యారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ లాంటి నాలుగు బడా బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 20న థియేటర్లలోకి తెస్తున్నాయి. హీరో ఇమేజ్ కంటే కథలోని సోల్‌ను నమ్మి దుల్కర్ చేసిన ఈ ప్రయోగం ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

