Site icon NTV Telugu

Dude : ‘డ్యూడ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?

Duad

Duad

దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డ్యూడ్’ సినిమా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీగా, ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మిశ్రమంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైన క్షణం నుంచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రదీప్‌ రంగనాథన్ ఎనర్జీ.. మామితా బైజు మరియు నేహా శెట్టి లు గ్లామర్‌, నటన పరంగా యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యాయి. ఇక కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రం వినోదంతో పాటు ఎమోషనల్ గా కూడా బాగా ఆకట్టుకుంది. ఫలితంగా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుని, ప్రదీప్‌ కెరీర్‌లో హ్యాట్రిక్‌ 100 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది.

Also Read : Prabhu : నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు – చెన్నైలో పోలీసుల హడావిడి!

ఇప్పుడు ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ‘డ్యూడ్’ చిత్రం నవంబర్‌ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో పాన్‌ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందనే టాక్‌ ఫిల్మ్‌సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. అంటే, తెలుగు, తమిళం, హిందీతో పాటు మరికొన్ని భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత కూడా సోషల్‌ మీడియాలో అభిమానులు “డ్యూడ్ ఓటీటీ ఎప్పుడు?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందనే వార్త వాళ్లలో మరింత ఉత్సాహం నింపుతోంది.

ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సాంగ్‌ యూత్‌ ప్లేలిస్టుల్లో స్థానం సంపాదించుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా, కోలీవుడ్‌లో మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా మార్కెట్‌లోనూ మంచి బిజినెస్‌ సాధించింది. మైత్రి బ్యానర్‌కు మరో గోల్డెన్‌ హిట్‌ జతచేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికపై మరలా అదే జోష్‌తో ప్రేక్షకులను అలరించబోతోంది.

Exit mobile version