Double iSmart makers Responded on rumours about the postponement: ఆగస్టు 15వ తేదీన పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లోని డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే నిజానికి అదే రోజు మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా కాగా మరొకటి విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ అనే సినిమా. నార్ని నితిన్ హీరోగా నటించిన ఆయ్ సినిమా ఒకరోజు లేటుగా ఆగస్టు 16న రిలీజ్ కాబోతోంది. అయితే మిగతా సినిమాల విషయంలో పరిస్థితులు ఎలా ఉన్నా డబుల్ ఇస్మార్ట్ సినిమాకి మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ గత సినిమా లైగర్ సినిమా నష్టాలకు సంబంధించి ఫిలిం ఛాంబర్ లో ఒక పెద్ద పంచాయతీ నడుస్తోంది.
YVS Chowdary: ఒకే సామాజిక వర్గ హీరోలతో సినిమాలు.. వైవీఎస్ చౌదరి షాకింగ్ ఆన్సర్
అనేక మీటింగ్లు జరిగినా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. లైగర్ సినిమా హక్కులు కొనుగోలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన వరంగల్ శీను తనకు రావలసిన నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే సినిమా రిలీజ్ చేసుకునేలా నైజాం ప్రాంతానికి చెందిన ఎగ్జిబిటర్ల చేత ఒత్తిడి చేయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నెల 15 నుంచి అవసరమైతే థియేటర్లు కూడా బంద్ చేసి సినిమా విడుదల ఆపాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ స్పందించింది,. ఎట్టి పరిస్థితుల్లో సినిమా వాయిదా పడే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఆ వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని అవి పూర్తిగా నిరాధారమైనవి అని చెప్పుకొచ్చింది. అంతా బాగానే ఉందని ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని థియేటర్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినందుకు రెడీగా ఉండాలని పేర్కొంది.