Dora Saiteja: కంటెంట్ క్రియేషన్ నా బిజినెస్, సినిమా నా ప్యాషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా నుంచి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు దొర సాయి తేజ. ఇటీవలే చాయ్ షాట్స్ నిర్మాణంలో, ఆదిత్య దేవులపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘దందా’ సిరీస్‌తో సరికొత్త సంచలనం సృష్టిస్తున్నారు. నటుడిగానే కాకుండా కంటెంట్ క్రియేటర్‌గా, వ్యాపారవేత్తగా చిన్న వయసులోనే మల్టీటాస్కింగ్ చేస్తూ దూసుకుపోతున్న ఈ యంగ్ టాలెంట్, తన సినీ ప్రయాణం మరియు జీవిత విశేషాలను పంచుకున్నారు. దొర సాయి తేజ సినీ ప్రయాణం నిన్న మొన్న మొదలైంది కాదు. ప్రభాస్ నటించిన ‘అడవి రాముడు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌కు డబ్బింగ్ చెప్పడంతో ఆయన సినీ పయనం ప్రారంభమైంది. ఆ తర్వాత ‘కొత్త బంగారు లోకం’, ‘హై స్కూల్’ వంటి సిరీస్‌లతో పాటు ‘అలా మొదలైంది’ చిత్రంలోనూ చిన్న పాత్రలో మెరిశారు. 2016లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఏర్పడిన అనుబంధం సినిమా నిర్మాణ ప్రక్రియపై మంచి అవగాహన పెంచింది. ఇక 2018లో ‘బ్యాక్ బెంచర్స్’ యూట్యూబ్ సిరీస్‌తో డిజిటల్ స్పేస్‌లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు.
వయసు కంటే ఐదేళ్లు పెద్దవాడిలా ఆలోచించడమే తన విజయ రహస్యమని తేజ చెప్తారు. “ఉదయం లేచినప్పటి నుంచి డైరెక్టర్‌గా, యాక్టర్, ప్రొడ్యూసర్, కంటెంట్ క్రియేటర్‌గా ఆలోచిస్తూనే ఉంటాను. కంటెంట్ క్రియేషన్ నా బిజినెస్ అయితే, సినిమా నా ప్యాషన్. ఈ రెండింటి కలయికే దొర సాయి తేజ,” అని స్పష్టం చేశారు. యూట్యూబ్ వీడియోలలో సాధారణ పాత్రలు చేసిన తనకు ‘దందా’ సిరీస్‌లోని ‘అరవింద్’ క్యారెక్టర్ ఒక నటుడిగా పెద్ద బ్రేక్ ఇచ్చిందని తేజ వెల్లడించారు. “నేను సెట్లో ఉన్నంత సేపు అరవింద్ పాత్రలోనే జీవించాను. ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించడానికి చాలావరకు సింగిల్ టేక్‌లోనే షాట్స్ పూర్తి చేసేవాడిని. కేవలం 7 రోజులు, 30 కాల్షీట్లలో పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి ఈ సిరీస్ పూర్తి చేశాం,” అని తెలిపారు. కంటెంట్ ఎంత బాగున్నా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోతే జనాల్లోకి వెళ్లదని నమ్మే తేజ, ‘దందా’ కోసం ఓ వైవిధ్యమైన పబ్లిసిటీ ప్లాన్ చేశారు. “నా ₹15 లక్షలు పోయాయి” అంటూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయి, సిరీస్ సక్సెస్‌కు బాగా దోహదపడింది. సోషల్ మీడియా అనేది ఒక వైకుంఠపాళి లాంటిదని హెచ్చరిస్తున్నారు తేజ. “కొద్దిగా ఫాలోవర్లు రాగానే లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటే పొరపాటే. వ్యూస్ కోసం ఇతరుల జీవితాలతో ఆడుకునే వాళ్లు కూడా ఇక్కడ ఉంటారు. పొగడ్తలతో పాటు విమర్శలను తట్టుకునే ధైర్యం ఉన్నప్పుడే ఈ డిజిటల్ ప్రపంచంలో నిలబడగలం,” అని హితవు పలికారు.
Also Read
- The PARADISE : 'ది ప్యారడైజ్' ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!