‘ధురంధర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘డాన్ 3’ మూవీ నుంచి రణవీర్ సింగ్ తప్పుకున్నారు. వరుసగా గ్యాంగ్ స్టర్ చిత్రాల్లో కనిపించడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. గల్లీబాయ్ ప్లేస్‌లోకి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌ను తీసుకునేందుకు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ అప్రోచ్ అయ్యారు. డాన్ 2లో హృతిక్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన నేపథ్యంలో డాన్ 3కి అతడే బెస్ట్ ఛాయిస్ అని దర్శకుడు ఫీలై అడిగితే.. క్రిష్ 4 ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాజెక్ట్ చేయలేనని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
ఇక అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ కింగ్ షారూక్ ఖాన్ దగ్గరకే డాన్ 3 వెళ్లింది. బాద్ షాను ఫర్హాన్ అక్తర్ కన్విన్స్ చేశారని సమాచారం. అయితే డాన్ 2 తర్వాత పర్హాన్ మెగా ఫోన్‌కు దూరంగా జరగడంతో.. అతడి మేకింగ్పై బిలీవ్ లేని కింగ్ ఖాన్ కొన్ని కండిషన్స్, డిమాండ్స్ చేస్తున్నారట. డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌లోకి సౌత్ హిట్ డైరెక్టర్ అట్లీని తీసుకు వస్తేనే సినిమా యాక్సెప్ట్ చేస్తానని చెప్పారట. అట్లీ ఇన్వాల్ మెంట్ కంపల్సరీ అని కింగ్ అంటున్నారట. డాన్ 3 నార్త్ మాత్రమే కాదు.. సౌత్ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు అట్లీ మార్క్ కరెక్ట్ అని భావించడం వల్లే షారూక్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు బీటౌన్ అంటోంది.
Also Read: Nabha Natesh: రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్.. నభా బౌన్స్ బ్యాక్ అవుతుందా?
‘జవాన్’తో తనకు భారీ హిట్ ఇచ్చిన నేపథ్యంలో అట్లీని బాద్ షా గట్టిగా నమ్ముతున్నారట. అందుకే డాన్ 3 ప్రాజెక్ట్‌లోకి ఈ సౌత్ దర్శకుడ్ని తీసుకురావాలనుకుంటున్నారట. షారూక్ ఖాన్ కండిషన్‌ను ఫర్హాన్ అక్తర్ యాక్సెప్ట్ చేశాడా లేదా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. ప్రస్తుతం షారూఖ్ ‘కింగ్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కింగ్ క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ షూట్ ముగిశాక.. డాన్ 3 ప్రాజెక్ట్ మీద షారూఖ్ కాన్సట్రేషన్ చేయబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి షారూఖ్‌కే ‘డాన్’ అయ్యేలా కనిపిస్తున్నారు.
