NTV Telugu Site icon

Chhava: చావాను మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?

February 7 2025 02 17t080609.064

February 7 2025 02 17t080609.064

తాజాగా బాలీవుడ్ నుంచి విడుదలైన హిస్టారికల్ మూవీ ‘చావా’. మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు.. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇక మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ని సవాల్ చేసే రేంజ్‌లో ఈ మూవీ నెంబర్లు నమోదవుతున్నాయి. బుక్కింగ్స్ చూసుకుంటే మొదటి వీకెండ్‌కే సులభంగా వంద కోట్లు దాటడం ఖాయం అని టాక్.

లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గాను , రష్మిక మందన్న యేసు బాయ్ గా కూడా నటించగా.. వీరి నటన చూసి థియేటర్ లో అభిమానులు ఒకవైపు నినాదాలు చేస్తు, మరొవైపు ఎమోషన్‌కు గురై కన్నీళ్లను కూడా పెట్టుకుంటున్నారు. అలా వారి పాత్రకు వంద శాతం న్యాయం చేశారు విక్కీ&రష్మిక. అయితే తాజాగా వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే ఈ మూవీ ఆఫర్ మొదట టాలీవుడ్ స్టార్ హీరో వద్దకు వచ్చిందట..

Also Read:Pavani Reddy: రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్..

అవును ముందుగా దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ఈ సినిమా కోసం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ని సంప్రదించారంట. కానీ ఆయన ఈ మూవీ నటించేందుకు ఒప్పుకోలేదంట. దీంతో ఈ కథను చాలా రోజులు పెండింగ్ లో పెట్టాడట. ఇక హీరోయిన్‌గా కత్రీనా కైఫ్‌ను అనుకున్నారంట. ఆమె కూడా దీనికి‌నో చెప్పిందట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. మహేష్ బాబు కనుక ఈ మూవీని ఒప్పుకొని ఉంటే పాన్ ఇండియా స్టార్‌గా ఒక రెంజ్‌లో స్టార్ డమ్ సంపాదించుకునేవాడు. ఏది ఏమైనప్పటికి విక్కీ మాత్రం ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించాడు. తన యాక్టింగ్‌కి ప్రేక్షకులు వందకు వంద మార్కులు ఇచ్చారు.