NTV Telugu Site icon

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాను మోసం చేసిన ఇద్దరు స్టార్ హీరోలు?

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన అదే సినిమాని బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. తర్వాత రణబీర్ కపూర్ హీరోగా చేసిన అనిమల్ సినిమా కేవలం బాలీవుడ్ లోనే కాదు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా మంచి హిట్ అయింది. ఒకరకంగా ఆ సినిమాతో ఆయనకు పాన్ ఇండియా డైరెక్టర్ అనే గుర్తింపు కూడా వచ్చేసింది. అయితే అదేమీ అంత ఈజీగా రాలేదని ఆయన సినీ ప్రయాణంలో ఐదేళ్లపాటు ఇబ్బందులు పడ్డాడని తాజాగా రైటర్ కోన వెంకట్ చెప్పుకొచ్చాడు.

Yash: కోర్టు మెట్లెక్కిన యశ్, రాధిక పండిట్.. ఏమైందంటే?

ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ ఇద్దరు హీరోల దగ్గర ఐదేళ్లు టైం వేస్ట్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అర్జున్ రెడ్డి కథ నచ్చడంతో ఒక హీరో ఆఫీసులో కూర్చుని కథ డెవలప్ చేయమన్నాడని దాదాపు మూడేళ్ల పాటు అతనికి భోజనం పెడుతూ నెల నెలకు కొంత డబ్బులిస్తూ టైంపాస్ చేశారు చివరికి సినిమా చేయలేము అన్నట్టు చెప్పడంతో ఆయన మూడేళ్ల తర్వాత మరో హీరో దగ్గరికి వెళ్ళా. డు అక్కడ కూడా రెండేళ్ల పాటు టైం వేస్ట్ చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్ కాదని అనుకుంటూ ఉండగా ఆయన సోదరుడే ముందుకు వచ్చి సినిమా చేయడానికి సిద్ధమయ్యాడని విజయ్ దేవరకొండ కథ ఒప్పుకొని షూటింగ్ మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అసలు సందీప్ రెడ్డి వంగానే మోసం చేసిన ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు అనే విషయం జరుగుతుంది. అంతేగాక అసలు వాళ్ళు స్టార్ హీరోలేనా లేక సాధారణ హీరోలా అనే చర్చ కూడా జరుగుతుంది. ఈ విషయం మీద స్వయంగా సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇస్తే తప్ప పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Show comments