సాధారణంగా దీపావళికి సినిమాల హడావుడి పెద్దగా ఉండదు, కానీ గతేడాది రిలీజ్ అయిన మూడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ వర్షం కురిపించడంతో, ఈ ఏడాది తెలుగులో మూడు స్ట్రైట్ సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ అయ్యాయి. ముందుగా, బన్నీ వాసు నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా, నిహారిక హీరోయిన్గా ‘మిత్ర మండలి’ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో, మొదటి ఆట నుంచి ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. పూర్తిస్థాయిలో ఈ సినిమా బుకింగ్స్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి అని చెప్పాలి.
Also Read :Lokesh Kanagaraj : పవన్’తో అలాంటి సినిమా.. వామ్మో లోకేష్?
ఇక ఆ తర్వాత వచ్చిన తెలుగు స్ట్రైట్ సినిమా ‘తెలుసు కదా’, సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందింది. నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంతమందికి నచ్చితే, సెకండ్ హాఫ్ కొంతమందికి నచ్చింది. సినిమా మొత్తం గా కొంతమందికి నచ్చింది, అయితే ఇలాంటి తరహా కథలు గతంలోనే చూసామని కొంతమంది పెదవి విరిచారు కూడా. అయితే, ఈ సినిమా యావరేజ్ రివ్యూస్ సాధించి కలెక్షన్స్ కూడా అదే దిశగా రాబడుతోంది.
ఇక మరో తెలుగు స్ట్రైట్ సినిమా ‘కే ర్యాంప్’ అన్నిటికన్నా ఆలస్యంగా విడుదలైంది. ఓవర్సీస్ రివ్యూస్ దారుణంగా వచ్చిన, తెలుగు రెగ్యులర్ రివ్యూస్ మాత్రం పాజిటివ్ గానే వచ్చాయి. సినిమా అద్భుతం అనలేం కానీ కామెడీ కోసం ఒకసారి చూడొచ్చని అంటున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ సినిమాకి కొంతవరకు బీ, సీ సెంటర్లలో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read :Samantha: విడిపోవడం, అనారోగ్యం.. అన్నీ బహిరంగంగానే ఎదుర్కొన్నా..
అయితే, డబ్బింగ్ సినిమాగా వచ్చిన ‘డ్యూడ్’ సినిమాకి కూడా అంత పాజిటివ్ రివ్యూస్ ఏమీ రాలేదు. తమిళంలో రివ్యూస్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ, తెలుగులో మాత్రం మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కొంతమంది సినిమా భలే ఉంది అంటుంటే, కొంతమంది మాత్రం అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ అని అన్నారు. కానీ, ఆశ్చర్యకరంగా మిగతా అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బుకింగ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బహుశా ప్రదీప్ రంగనాథన్ గత సినిమాల ఎఫెక్ట్తో ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారేమో అనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే, ఈ దీపావళి సినిమాలలో ‘డ్యూడ్’ భారీ కలెక్షన్స్ రాబడుతుంటే, తరువాత స్థానంలో ‘కే ర్యాంప్’ నిలిచింది. ఇక ఆ తరువాత ‘తెలుసు కదా’ ఫాలోడ్ బై ‘మిత్ర మండలి’ అనే చెప్పాలి.
