హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమన్-2020 టెలివిజన్ గా బిగ్ బాస్ బ్యూటీ దివి సరికొత్త రికార్డు సృష్టించింది. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు-4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దివి బుల్లితెరపై అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విషయం గురించి దివి మాట్లాడుతూ “నేను ప్రస్తుతం షాక్‌లో ఉన్నాను. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ట్యాగ్ చాలా పెద్దది. నేను ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. నా అందం కంటే, ప్రజలు నా పాత్రను ఆరాధిస్తారు. నేను మానసికంగా అందంగా ఉండాలనుకుంటాను. అందం కాలంతో మారుతుంది. కానీ మీ తెలివితేటలు మీతోనే ఉంటాయి. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ట్యాగ్ తనకు కొత్త అవకాశాలను తెస్తుందని దివి ఆశాభావం వ్యక్తం చేశారు. 70 ఎంఎం తెరపై తనను తాను చూడాలనేది దివి కోరికట. చిరంజీవి చిత్రంలో ఆఫర్ కొట్టేసిన దివి ‘లంబసింగి’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇటీవల స్పార్క్ ఓటిటిలో ‘క్యాబ్ స్టోరీస్’తో పలకరించింది దివి. ఆమె ఖాతాలో మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి.
ఇక అబ్బాయిల్లో తనకు ఇష్టమైన విషయమేంటో కూడా చెప్పేసింది ఈ బ్యూటీ. “నేను ఎప్పుడూ అబ్బాయిల్లో హైట్ చూస్తాను. నేను 5’8 ఉన్నాను కాబట్టి ఆ వ్యక్తి కనీసం 6’2 లేదా 6’3 ఉండాలి. రెండవ విషయం అతని తెలివితేటలు. అతను తెలివైనవాడు కావడం నాకు చాలా ముఖ్యం. అంతేకాదు కష్టపడి పని చేయాలి. నాపై శ్రద్ధ చూపెట్టాలి. జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలలో నాతోనే ఉండాలి” అంటూ అబ్బాయిల్లో తనకు నచ్చే లక్షణాలు ఏంటో పెద్ద లిస్ట్ చెప్పుకొచ్చింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం సింగిల్ గానే ఉందట…!