Tollywood : మైథలాజీకల్ కథల పై టాలీవుడ్ దర్శకుల మోజు..!
- మళ్ళీ అందరి చూపు మైథలాజీ కథలపైనే
- కల్కి హిట్ అవడంతో అదే జానర్ సినిమాలకు డిమాండ్
- దేవకీ నందన వాసుదేవ్ కూడా అదే టచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక జానర్ లో వచ్చిన సినిమా హిట్ అయింది అంటే వరుసగా అదే టైప్ కథలతో సినిమాలు చేస్తారు దర్శకులు. మగధీర హిట్ అవడంతో అటువంటి కథలతో శక్తి, బద్రీనాధ్ వంటి సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఫలితం ఎలా వచ్చిందో అందరికి తెలిసిన సంగతే. అదే దారిలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సూపర్ హిట్ సాధించడం తో దాదాపు ఒక డజను పైగా సినిమాలు అదే జానర్ లో టాలీవుడ్ ని పలకరించాయి. ఒకటి, అరా తప్ప మిగిలిన చిత్రాలన్నీ దారుణమైన ఫ్లాప్ లుగా మిగిలాయి.
తాజగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి 2898AD’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయ సాధించింది. కాగా కల్కి మైథలాజీ జానర్ లో నడిచే కథ . ముఖ్యంగా మహాభారతంలోని అశ్వద్ధామ, అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడుల ధీరత్వాన్ని సిల్వర్ స్క్రీన్ పై చుసిన ప్రేక్షకుల తన్మయత్వం చెందారు. కల్కి 2898AD తర్వాత మళ్ళీ అందరి దర్శకుల చూపు మైథలాజీ కథలపై వెళ్తుంది. ఇప్పటికే మైథలాజికల్ టచ్ తో షూటింగ్ చేస్తున్న సినిమాలకు సంబంధించిన నిర్మాతలు మంచి జోష్ లో ఉన్నారట. ఇక మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా రాబోతున్న ‘దేవకీ నందన వాసుదేవ్’ చిత్రంలో కూడా మైథలాజికల్ టచ్ ఉండబోతోంది. ఈ చిత్రంలో కృష్ణుడు పాత్ర ముఖ్య భూమిక పోషిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించారు. సాయి మాధవ్ బుర్ర మాటలు రచయితగా చేసిన ఈ ‘దేవకీ నందన వాసుదేవ్’ ఆగస్టులో విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు నిర్మాతలు. రానున్న రోజుల్లో మైథలాజికల్ జానర్ లో ఎన్ని చిత్రాలు వస్తాయో చుడాలి.
Also Read
- Vishwanath and Sons Trailer: 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
- Ritika Nayak : 'కొరియన్ కనకరాజు'తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
- Varun Tej : 'ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు'.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
- CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
Also Read: Mb Fans : మురారీ వద్దు..ఖలేజా ముద్దు..
తాజావార్తలు
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!