NTV Telugu Site icon

Tollywood : మైథలాజీకల్ కథల పై టాలీవుడ్ దర్శకుల మోజు..!

Untitled Design (2)

Untitled Design (2)

ఒక జానర్ లో వచ్చిన సినిమా హిట్ అయింది అంటే వరుసగా అదే టైప్ కథలతో సినిమాలు చేస్తారు దర్శకులు. మగధీర హిట్ అవడంతో అటువంటి కథలతో శక్తి, బద్రీనాధ్ వంటి సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఫలితం ఎలా వచ్చిందో అందరికి తెలిసిన సంగతే. అదే దారిలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సూపర్ హిట్ సాధించడం తో దాదాపు ఒక డజను పైగా సినిమాలు అదే జానర్ లో టాలీవుడ్ ని పలకరించాయి. ఒకటి, అరా తప్ప మిగిలిన చిత్రాలన్నీ దారుణమైన ఫ్లాప్ లుగా మిగిలాయి.

తాజగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి 2898AD‌‌’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయ సాధించింది. కాగా కల్కి మైథలాజీ జానర్ లో నడిచే కథ . ముఖ్యంగా మహాభారతంలోని అశ్వద్ధామ, అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడుల ధీరత్వాన్ని సిల్వర్ స్క్రీన్ పై చుసిన ప్రేక్షకుల తన్మయత్వం చెందారు. కల్కి 2898AD‌‌ తర్వాత మళ్ళీ అందరి దర్శకుల చూపు మైథలాజీ కథలపై వెళ్తుంది. ఇప్పటికే మైథలాజికల్ టచ్ తో షూటింగ్ చేస్తున్న సినిమాలకు సంబంధించిన నిర్మాతలు మంచి జోష్ లో ఉన్నారట. ఇక మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా రాబోతున్న ‘దేవకీ నందన వాసుదేవ్’ చిత్రంలో కూడా మైథలాజికల్ టచ్ ఉండబోతోంది. ఈ చిత్రంలో కృష్ణుడు పాత్ర ముఖ్య భూమిక పోషిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించారు. సాయి మాధవ్ బుర్ర మాటలు రచయితగా చేసిన ఈ ‘దేవకీ నందన వాసుదేవ్’ ఆగస్టులో విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు నిర్మాతలు. రానున్న రోజుల్లో మైథలాజికల్ జానర్ లో ఎన్ని చిత్రాలు వస్తాయో చుడాలి.

 

Also  Read: Mb Fans : మురారీ వద్దు..ఖలేజా ముద్దు..