ఆయన ఒక యంగ్ డైరెక్టర్. కెరియర్లో ముందు చేసిన సినిమాలు కొంచెం ఇబ్బంది పెట్టిన చివరిగా ఆయన నుంచి వచ్చిన రెండు సినిమాలు మాత్రం మంచి హిట్లుగా నిలిచాయి. నిజానికి ఆ రెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్ కావడమే కాదు ఆయనకు మంచి పేరు కూడా తీసుకొచ్చాయి. దర్శకత్వంతో పాటు కథలలో కూడా ఎక్కడా వల్గారిటీకి ఆస్కారం లేకుండా క్లీన్ ఎంటర్టైనర్లుగా నిలిచాయి. ఇలాంటి దర్శకుడు తో సినిమా చేయడానికి ఏ హీరో అయినా ఆసక్తి కనబరుస్తాడు కానీ ఈ దర్శకుడు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
Chhaava: అడ్వాన్స్ బుకింగ్‌లో ‘ఛావా’ సంచలనం..
ఆయన ఏ స్టార్ హీరోతోనో తదుపరి సినిమా చేస్తాడని అనుకుంటే స్టార్ హీరో కాదు కదా టాలీవుడ్ లో టైర్ 2 హీరోలు కూడా ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇటీవల అనూహ్యంగా హిట్ అందుకున్న ఒక సీనియర్ హీరోని సంప్రదిస్తే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరో ప్రామిసింగ్ హీరోని కూడా కలిసి కథ చెబితే తనకి ఎందుకు ఎక్కలేదని చెప్పాడట. దీంతో సదరు యంగ్ డైరెక్టర్ ప్రస్తుతానికి మరిన్ని లైన్స్ సిద్ధం చేసుకుని మరింత మంది హీరోలను కలిసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇండస్ట్రీలో ఇప్పుడు హిట్లు ఉన్న దర్శకుడు కాదు. సరైన లైన్ తో వచ్చిన దర్శకుడికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని హీరోలు భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది.