Sukumar: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మేము నిద్రపోయేవాళ్లం కాదు.. సుకుమార్ ఎమోషనల్ స్పీచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడిన మాటలు, రామ్ చరణ్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కగానే మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని సుకుమార్ చాటుకున్నారు. “చిరంజీవి సార్ పక్కన కూర్చున్నంత సేపు నాకు ఊపిరాడనట్లు అనిపించింది. అందుకే స్టేజ్ మీదకు పిలవగానే హ్యాపీగా పరిగెత్తుకుంటూ వచ్చేశాను. చిన్నప్పుడు మీ సినిమా ఫ్లాప్ అయితే మీరు నిద్రపోయేవారేమో కానీ, మీ నెక్స్ట్ సినిమా హిట్ అయ్యే వరకు మేము నిద్రపోయేవాళ్లం కాదు. అలాంటిది మరి చరణ్‌ను మాకు ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ సార్” అంటూ సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు.
“ఈ సినిమా కథను బుచ్చిబాబు వెళ్లి చరణ్‌కు కింద నేల మీద కూర్చుని చెప్తుంటే.. ఇద్దరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక కమర్షియల్ మాస్ హీరో ఇలాంటి విలన్ లేని, కేవలం పరిస్థితులే విలన్ అయ్యే వైవిధ్యమైన కాన్సెప్ట్ సినిమాను ఒప్పుకోవడం మామూలు విషయం కాదు. చరణ్ కష్టానికి, కసికి దక్కిన ఫలితమే ఈ రిజల్ట్. అందరూ చరణ్ నటనను పొగుడుతుంటే.. ‘ఇలాంటి కథ రాయబట్టే కదా నేను చేయగలిగాను’ అని చరణ్ చాలా వినమ్రంగా అన్నాడు. చుట్టుపక్కల వాళ్లందరికీ తెలుసు.. మా చరణ్ బంగారం, అంత మంచి హృదయం ఉన్న వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు” అని రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తన శిష్యుడు బుచ్చిబాబు గురించి మాట్లాడుతూ.. “ఒక ‘ఉప్పెన’ లాంటి లవ్ స్టోరీ తీసిన కుర్రాడు.. ఇంత పెద్ద ‘పెద్ది’ సినిమాను హ్యాండిల్ చేయడం చాలా గొప్ప విషయం. వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ డైరెక్టర్ అయ్యావు. లవ్ యు రా” అంటూ అభినందించారు. అలాగే కథ విని ఎగ్జైట్ అయి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన ఏఆర్ రెహ్మాన్‌కు, మైత్రి మూవీస్ రవి, నవీన్ గార్లకు, కెమెరామెన్ రత్నవేలు, నటుడు జగపతిబాబులకు సుకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే వేడుకలో స్టేజ్ కింద ఉన్న అభిమానులు సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న తదుపరి చిత్రం ‘RC 17’ అప్డేట్ కావాలని గట్టిగా అరిచారు. దీనిపై సుకుమార్ నవ్వుతూ రియాక్ట్ అయ్యారు. “ఆర్సీ 17 సినిమా గురించే కదా అడుగుతున్నారు? నాకు అర్థమైంది.. కానీ నేను చెప్పను! నాకు ముందే లీక్ చేయడం ఇష్టం ఉండదు. మీరే ఊహించుకోండి.. థాంక్యూ, లవ్ యు ఆల్” అంటూ సుకుమార్ ఈ సినిమాపై హైప్ పెంచేశారు.
Also Read
- SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
- The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. 'ది పారడైజ్' సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
తాజావార్తలు
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!