సింగీతం హృదయం నుండి పుట్టుకొచ్చిన పాట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావులో సంగీత దర్శకుడు కూడా ఉన్నాడు. కొన్ని కన్నడ చిత్రాలతో పాటు యానిమేషన్ మూవీ ‘ఘటోత్కచ’కు, తెలుగు సినిమా ‘వెల్ కమ్ ఒబామా’కు ఆయన స్వరాలు సమకూర్చారు. తొంభై వసంతాలు దరిచేరినా ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు సింగీతం శ్రీనివాసరావు. ఇటీవల కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు. దర్శకత్వంతో పాటు రచన, సంగీతం ఈ రెండింటినీ సింగీతం ఇష్టపడతారాయన. ఇప్పటికీ సంగీత సాధన చేస్తూ, ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతుంటారు. కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైనప్పుడు కూడా జూమ్ మీటింగ్స్ ద్వారా మిత్రులతో మాటామంతీ జరిపి వారిని ఉత్తేజ భరితులను చేసిన వ్యక్తి సింగీతం. తాజాగా ఆయన ఓ ఆంగ్ల గీతాన్ని స్వర పరిచి, గానం చేశారు.
సింగీతం శ్రీనివాసరావు కాలేజ్ డేస్ లో చదువుకున్న ఆ గీతాన్ని హెన్రీ వర్డ్స్ వర్త్ లాంగ్ ఫెలో రాశారు. ‘లైఫ్ ఈజ్ రియల్, లైఫ్ ఈజ్ ఎర్నెస్ట్ అండ్ ది గ్రేవ్ ఈజ్ నాట్ ఇట్స్ గోల్’ అంటూ సాగే ఈ కవిత కరోనా సమయంలో ప్రజలలో ధైర్యాన్ని నింపుతుందని సింగీతం భావించారు. మాస్క్ ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు మనిషి పేనిక్ కాకుండా ధైర్యంగా ఉండాలని, ధైర్యాన్ని కోల్పోతే ఇమ్యూనిటీ లెవల్స్ తగ్గిపోయే ఆస్కారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వర్డ్స్ వర్త్ గీతంలోని కొన్ని వాక్యాలను సింగీతం పాడగా, పవన్ చరణ్ బోనిల వయోలిన్ సహకారం అందించారు. గౌతమ్ రాజు దీనిని ఎడిటింగ్ చేశారు. ఈ గీతాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సింగీతం సమాజానికి అందించారు. ఈ పాట కొద్ది మందిలో ధైర్యాన్ని నింపినా తన ప్రయత్నం సఫలీకృతం అయినట్టేనని సింగీతం తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్‌రావు ఫైర్..
-
Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..