Site icon NTV Telugu

AditiShankar : టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెడుతున్న దర్శకుడు ‘శంకర్’ కూతురు..

Untitled Design (2)

Untitled Design (2)

తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కుమార్తెలలో ఒకరైన అతిధి శంకర్ తమిళ చిత్ర పరిశ్రమలో కార్తీ నటించిన వీరుమాన్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ సరసన మావీరన్ సూపర్ హిట్ తో అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అర్జున్ దాస్ కు జోడిగా నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న యూత్ ఫుల్ కాలేజ్ లవ్ నేపథ్యంలో రానున్న  సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read : Singar Mano : మరో ములుపు తిరిగిన సింగర్ మనో కుమారుల దాడి కేసు.

మరోవైపు అతిధి శంకర్ టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. యంగ్ హీరోలు బెల్లం కొండ శ్రీనివాస్, మంచు మనోజ్ కుమార్, నారా రోహిత్ ఈ ముగ్గురు కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమలో హీరోయిన్ గా శంకర్ కూతురు అతిధి శంకర్ ను తీసుకున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజా షెడ్యూల్ లో అతిధి శంకర్ ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టింది. టాలీవుడ్ కు పరిచయం కానున్ననేపథ్యంలో చిత్ర యూనిట్ అతిధి శంకర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం చిత్రాలు తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ భారీ ముల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుంది. తమిళంలో సూరి నటించిన సూపర్ హిట్ చిత్రం గరుడన్ రీమేక్ గా ఈ సీనియా రానుంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ఆలోచన చేస్తున్నారు మేకర్స్.

Exit mobile version