NTV Telugu Site icon

RGV Police Interrogation: ముగిసిన ఆర్జీవీ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నల వర్షం..!

Rgv

Rgv

RGV Police Interrogation: సోషల్‌ మీడియాతో పోస్టులతో వివాదాలు కొనితెచ్చుకున్న సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ పోలీసు విచారణ ముగిసింది.. ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై దాదాపు 9 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసు అధికారులు.. సీఐ శ్రీకాంత్‌ నేతృత్వంలోని పోలీసుల టీమ్‌ ఆర్జీవీని విచారించింది.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌తో పాటు నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ (ట్విట్టర్‌)లోని తన ఖాతాలో పోస్ట్‌ చేశారు ఆర్జీవీ.. అయితే, తన ఎక్స్ లో నుండే పోస్టింగ్స్ చేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారట ఆర్జీవీ.. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ పోస్టింగ్స్ చేసినట్టు తెలిపారట.. కానీ, ఆ పోస్టింగ్స్ తో వైసీపీ నేతలకు సంబంధం లేదని ఆర్జీవీ సమాధానం ఇచ్చారట..

Read Also: Chinnamail Anji Reddy: బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ‘పట్టభద్రుల సంకల్ప యాత్ర’..

మరోవైపు ఫైబర్ నెట్ నుండి రెండు కోట్ల రూపాయలు… దర్శకుడు ఆర్జీవీకి కేటాయించడంపై ప్రశ్నలు సంధించారు పోలీసులు. కానీ, రెండు కోట్ల కేటాయింపు పై నోరు విప్పలేదట ఆర్జీవీ.. ఇక, వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు పోలీసులు. వైసీపీ నాయకులతో వ్యక్తి గత పరిచయాలు మాత్రమే ఉన్నాయని ఆర్జీవీ సమాధానం ఇచ్చారట.. మరోసారి ఆర్జీవీని విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు.. అయితే, 9 గంటల పాటు ఒంగోలు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసుల విచారణ ముగియడంతో.. ఆ తర్వాత నేరుగా హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లిపోయారు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ..