Site icon NTV Telugu

Bollywood : ఆషికీ 3పై షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన డైరెక్టర్ మోహిత్ సూరి

Bollywood

Bollywood

2013 లో రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆషికీ 2. ప్రేమ కథల స్పెషలిస్ట్ మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా శ్రద్ధా కపూర్ జోడీగా నటించారు .ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించి అనేక భాషల్లో రీమేక్ అయింది. ఒక ప్రేమ కథ ప్రేక్షకుల హృదయాలను తాకినప్పుడు దానికి సీక్వెల్ రావాలని కోరుకోవడం సహజం. ఆషికీ 2 సీక్వెల్‌ ఆషికీ 3 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Also Read : PuriSethupathi : క్రిస్మస్ రేస్ లో బెగ్గర్.. పూరి రిస్క్ చేస్తున్నాడా.?

ఈ విషయమై డైరెక్టర్ మోహిత్ సూరి ని ఓ ఇంటర్వ్యూలో ఆషికీ 3 గురించి స్పందించాడు. ఆదిత్యా – శ్రద్ధా జంటతో మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేయడం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. అయితే,  ఆషికీ కంటే మెరుగైన స్క్రిప్ట్ వచ్చినప్పుడే సీక్వెల్‌ గురించి ఆలోచిస్తాను. సైయారా అనే కథను అసలు “ఆషికీ 3″గా ప్రారంభించామని కానీ నిర్మాతలతో జరిగిన క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పాడు. ఇక మరోవైపు అటు ఆదిత్యా రాయ్ కపూర్ ‘మెట్రో ఇన్ దినో’, ఇటు శ్రద్ధా కపూర్ “స్త్రీ 2” హిట్‌తో సక్సెస్‌లో ఉన్నారు. ఈ ట్రయో కాంబినేషన్‌ ఆశికీ 3తో వస్తారో లేదో తెలీదు కాని, ప్రేక్షకులు మాత్రం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన సైయారా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది సైయారా. మరి మోహిత్ సూరి ఇదే జోష్ లో ఆషికీ 3 సీక్వెల్ ను తీసుకువస్తాడేమో చూడాలి.

Exit mobile version