Site icon NTV Telugu

Dilraju : టాలెంట్ ఉన్న వారి కోసం సిద్ధమైన “దిల్ రాజు డ్రీమ్స్”

Dil Raju

Dil Raju

దిల్ రాజు అనే పేరుకు తెలుగు సినీ పరిశ్రమలోనే కాక, యావత్ భారతీయ సినీ పరిశ్రమలో కూడా పరిచయం అవసరం లేదు. తన మొదటి సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న దిల్ రాజు టాలెంట్ కు కేరాఫ్ అడ్రస్. టాలెంట్ ఎక్కడ ఉన్నా ఆదరించే వ్యక్తిగా ఎంతోమంది హీరోలను, నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఇప్పుడు ఆయన మరో ముందడుగు వేసి, తెలుగు సినీ పరిశ్రమకు మరింత టాలెంట్ ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Janhvi Kapoor : కేన్స్‌లో మెదటి సారి తలుకుమన్న జాన్వీ..

కొత్త టాలెంట్ ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు దిల్ రాజు తాజాగా ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఫ్రెష్ కంటెంట్‌ను, టాలెంట్ ను ప్రోత్సహించే దిల్ రాజు ఇప్పుడు “దిల్ రాజు డ్రీమ్స్” ప్లాట్‌ఫామ్ ద్వారా యంగ్ టాలెంట్ ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ నెల నుంచి ఆయన సిద్ధం చేసిన ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ యాక్టివ్ కానుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/ లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేస్తే, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది.

Also Read: Nidhhi Agerwal : నిధి అగర్వాల్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

జూన్‌లో ఈ పోర్టల్ సిద్ధమైన తర్వాత, ‘దిల్ రాజు డ్రీమ్స్’ ద్వారా యువ ప్రతిభావంతులు తమ ఆలోచనలను ఈ బృందం దృష్టికి తీసుకెళ్లవచ్చు. తమ టాలెంట్ నిరూపించుకోవాలనుకునేవారు ఎంతోమంది సరైన ప్లాట్ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. టాలెంట్ ఉన్నా సినీ పరిశ్రమలో కాంటాక్ట్స్ లేక, ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ముందుకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. టాలెంట్ ఉన్నవారు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి దిల్ రాజు స్థాపించిందే ఈ దిల్ రాజు డ్రీమ్స్.. మరి ఇంకెందుకు ఆలస్యం? టాలెంట్ ఉండి, సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నవారు, సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునేవారు, సినీ పరిశ్రమంలో భాగము కావాలనుకునేవారు దిల్ రాజు డ్రీమ్స్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ కలను సాకారం చేసుకోవచ్చు.

Exit mobile version