OG సూపర్ హిట్ కావడంతో వన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు పవర్ స్టార్. ఇప్పటికే నలుగురు నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుతో సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచేసినట్టు సమాచారం. గతంలో వీరి కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ డేట్స్ దొరకడంతో ఇమ్మిడియట్ గా సినిమా చేసేందుకు కథల వేటలో ఉన్నాడు దిల్ రాజు.
Also Read : Tollywood Diwali : నాలుగు సినిమాలలో సౌండ్ చేసిన బాంబు.. తుస్సుమనిపించిన సినిమాలు ఏవంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రెండు పవర్ ఫుల్ కథలను రెడీ చేస్తున్నాడు దిల్ రాజు. అందులో ఒక కథలో కాలేజీలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్ గా కనిపించబోతున్నాడట. మరొటి ఆవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. రెండు కథలు లైన్స్ ను పవర్ స్టార్ కు వినిపించేందుకు టీమ్ రెడీ అవుతోంది. కథ ఓకే అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవర్ స్టార్ నటించబోయే సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాను తమ ఆస్థాన దర్శకుడు, SVC లక్కీ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరక్షన్ లో చేయించాలనేది దిల్ రాజు ప్లాన్. అనిల్ రావిపూడి ప్రస్తుతం చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. మరి దిల్ రాజు టీమ్ రెడీ చేసే కథకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో.
