టాలీవుడ్‌లో దిల్ రాజు పేరు వినిపించగానే ప్రేక్షకుల మదిలో హిట్ సినిమాలు మెదులుతాయి. నిర్మాతగా తనదైన మార్క్ చూపిస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించిన ఆయన, ప్రొఫెషనల్‌గా ఎంతగా ఎదిగారో, వ్యక్తిగతంగా కూడా ఎన్నో మలుపులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన రెండో వివాహం గురించి అప్పట్లో మీడియాలో గట్టి చర్చ జరిగింది. తాజాగా దిల్ రాజు సతీమణి తేజస్వినీ ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టడంతో ఈ వివాహం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది.
Also Read :Pawankalyan : ఆస్కార్ అకాడమీకి కమల్ హాసన్ ఎంపిక.. ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసలు
ఈ మధ్యకాలంలో దిల్ రాజ్ సతీమణి తేజస్విని సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. మా ఇంట్లో ఏడాదికి ఒక్క సినిమా చూస్తాం, అదీ దసరాకే. అలాంటి సమయంలో దిల్ రాజు గారితో పరిచయం ఏర్పడింది. మొదట ఆయన డైరెక్టర్ అనుకున్న. గూగుల్ చేయగానే నిర్మాత అని తెలిసింది. కానీ ఆయనకు ఇప్పటికే పెళ్లి అయిందని తెలిసిన తర్వాత ఈ సంబంధాన్ని కొనసాగించ కూడదని నేను వెనక్కి తగ్గాను. అయితే కొంత కాలానికి ఆలోచనలో మార్పు వచ్చింది. నిజాయితీతో ఉండే వ్యక్తి ఉన్నా సరిపోతుందని అనిపించి ఆయనతో జర్నీ మొదలుపెట్టాను. నేను మా పెద్ద మావయ్య దగ్గరే పెరిగాను. మా ఫ్యామిలీలో ఆయన హిట్లర్ లాంటివారు. ఎవరినీ అంగీకరించరు. కానీ ఆశ్చర్యంగా ఆయనే మొదట అంగీకరించారు. మిగతా బంధువులు మాత్రం మొదట నిరాకరించారు. కానీ చివరకు వారందరినీ ఒప్పుకున్నాక పెళ్లి జరిగింది’ అని తేజస్వినీ తెలిపింది.