Site icon NTV Telugu

Dil Raju: తెలంగాణ నేపథ్యంలో ఆశిష్ రెడ్డి కొత్త సినిమా ‘దేత్తడి’

Asish Reddy

Asish Reddy

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు , యువ నటుడు ఆశిష్ రెడ్డి తన తాజా చిత్రం ‘దేత్తడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఆదిత్య రావు గంగసాని రూపొందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమా మాస్ అప్పీల్‌తో కల్చరల్ డ్రామాగా తెరకెక్కనుంది. ఆశిష్ పుట్టిన రోజు సంధర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఇటీవల విడుదల చేసి, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు.
‘దేత్తడి’ సినిమా ఆశిష్ రెడ్డి కెరీర్‌లో నాల్గవ చిత్రం. గతంలో ‘రౌడీ బాయ్స్’, ‘సెల్ఫిష్’(ఇంకా రిలీజ్ కాలేదు ) , ‘లవ్ మీ: ఇఫ్ యు డేర్’ చిత్రాలతో తన నటనా ప్రతిభను చాటిన ఆశిష్, ఈ సినిమాతో మరోసారి వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. తెలంగాణ సంస్కృతి, జీవన శైలిని ప్రతిబింబించే ఈ చిత్రం, యువతను ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. సికింద్రాబాద్‌లో ఈ సినిమా ప్రకటన గ్లిమ్స్ షూట్ చేసినట్లు సమాచారం. ఈ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆశిష్ రగ్గడ్ లుక్, తెలంగాణ సంప్రదాయాలను సూచించే బ్యాక్‌గ్రౌండ్ అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమా కథ, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ కొత్త చిత్రం, ఆశిష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. గతంలో ఆయన చిత్రాలు యూత్‌ఫుల్, రొమాంటిక్ జోనర్‌లలో ఉండగా, ‘దేత్తడి’ మాత్రం తెలంగాణ కల్చరల్ డ్రామాగా, మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందుతోంది.
Exit mobile version