Site icon NTV Telugu

Shirish Reddy: నేను మూర్ఖుడిని కాదు .. రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నాం!

Sirish

Sirish

రామ్ చరణ్ తేజ్ మీద చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో రామ్ చరణ్ అభిమానులు దిల్ రాజు సోదరుడు శిరీష్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన ఒక లేఖ విడుదల చేసి క్షమాపణలు చెప్పారు ఇక ఇప్పుడు ఏకంగా ఒక వీడియో రికార్డ్ చేసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో శిరీష్ మాట్లాడిన మాటలు యధాతధంగా మీకోసం.

Also Read:Sangeet Sobhan: నిహారిక నిర్మాతగా సినిమా మొదలెట్టిన సంగీత్ శోభన్

‘’తెలుగు సినీ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు నమస్కారం. మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకు రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. నాకు, రామ్ చరణ్ గారికి మధ్య మంచి సంబంధం ఉంది. నేను అభిమానించే హీరోలలో రామ్ చరణ్ ఒకరు. ఆయనను అవమానపరచడం కానీ, కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడూ చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లినా, అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి, వారికి నిజంగా నేను క్షమాపణ చెబుతున్నాను. చరణ్ గారికి కూడా క్షమాపణ చెబుతున్నాను. ఆయనతో నాకున్న సంబంధాన్ని నేను పాడు చేసుకోదలచుకోలేదు. మీడియాలో వస్తున్న కథనాలు కానీ, జనం బయట మాట్లాడుతున్న మాటలు గానీ, ట్రోలింగ్‌లు కానీ, అభిమానులు పడిన బాధ కానీ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒక హీరోని అలా అన్నప్పుడు ఎవరూ భరించలేరు. నేను అన్న ఉద్దేశం అది కాదు. మాకు ఉన్న సంబంధంలో, మాకు ఉన్న సన్నిహితత్వంతో నేను మాట దొర్లాను తప్ప, ఆయనను అవమానపరచడానికి కాదు. మెగా హీరోలందరితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ కానీ, సాయి ధరమ్ తేజ్‌తో రెండు సినిమాలు, చరణ్ గారితో రెండు సినిమాలు చేశాం. చిరంజీవి గారు మా రాజు గారితో, నాతో మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి అనుబంధం ఉన్న వారిని అవమానించే అంత మూర్ఖుడిని కాదు నేను.

Also Read:Dil Raju: రివ్యూస్ రాసేప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి!

దయచేసి అభిమానులు, మిగతా అందరూ అర్థం చేసుకోవాలి. సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ రిలీజ్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నాం. సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే, ఆయన ‘చేయొద్దు’ అని చెప్పి ఉంటే, సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఆయన మనసు గొప్పది కాబట్టే, ఆ రోజు ఇబ్బందులు ఉంటాయేమో, ఫైనాన్షియల్‌గా అనుకుంటూ కూడా, ‘మీరు దీన్ని కూడా రిలీజ్ చేసుకోండి’ అని గొప్ప మనసుతో ఒప్పుకున్న వ్యక్తి ఆయన. ఆయన్ని ఎందుకు అవమానపరుస్తాం? దయచేసి నేను ఆయన గురించి మాట్లాడిన మాటలను అపార్థం చేసుకుంటే, అభిమానులందరికీ క్షమాపణ చెబుతున్నాను. దయచేసి మా సంబంధాన్ని పాడు చేయొద్దు. మాకు మళ్లీ మరో ప్రాజెక్ట్ రెడీ అయింది. నెక్స్ట్ చరణ్ గారితో సినిమా తీయబోతున్నాం. అలాంటిది అనవసరంగా మా ఇద్దరి మధ్య ఈ అభిప్రాయ భేదాలను తీసుకురావద్దని అందరినీ వేడుకుంటున్నాను. ఆంధ్ర ప్రేక్షకులందరూ ఇది గమనించాలి. నాకు, చరణ్ గారికి మంచి సంబంధం ఉంది. నేను ఆయన గురించి ఎప్పుడూ తప్పు మాట్లాడను. నేను ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో నాకు తెలియకుండా మాట దొర్లిందేమో. అలాంటిది ఏమైనా ఉంటే, అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.’’

Exit mobile version