Alias Rukmini: హీరో నితిన్ నటిస్తున్న తాజా సినిమా ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్‌కు ముందే టాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. నేచురల్ స్టార్ నాని, ఆయన సోదరి దీప్తి గంటా కలిసి ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలోకి రానుంది. తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత దిల్ రాజు, సినిమా రిలీజ్‌కి ముందే రిజల్ట్ ఎలా ఉండబోతోందో తేల్చి చెప్పేశారు. ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని, డిసెంబర్ 3నే ప్రీమియర్ షోలు చూసి పార్టీ చేసుకుందామని ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.
ఈ సినిమా ప్రోమో, పాటలు చూసినప్పుడే సక్సెస్ వైబ్స్ కనిపించాయని దిల్ రాజు అన్నారు. అసలు ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే డబ్బింగ్ పూర్తయిన వెంటనే నితిన్ తనకు మెసేజ్ పెట్టాడని.. “అంకుల్, ఇప్పుడే సినిమా చూశాను.. సూపర్ హిట్” అని చెప్పాడని దిల్ రాజు రివీల్ చేశారు. ఆ తర్వాత ట్రైలర్ చూడగానే తాను కూడా నాని, నితిన్‌లకు మెసేజ్ పెట్టి సినిమా హిట్ అని ఫిక్స్ అయ్యానన్నారు. 25 ఏళ్ల కెరీర్లో నితిన్‌కు హిట్లు, ఫ్లాపులు కొత్తేమీ కాదని, మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వస్తేనే మళ్లీ వచ్చే సక్సెస్‌ను ఎంజాయ్ చేయగలమని చెప్పారు. డిసెంబర్ 4న నితిన్ ఖాతాలో మరో పెద్ద సక్సెస్ పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు నిర్మాతగా నాని సక్సెస్ జర్నీపైనా దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. ఒక సక్సెస్ఫుల్ హీరోగా ఉంటూ, వేరే హీరోలతో సినిమాలు నిర్మించి హిట్లు కొట్టడం అంత ఈజీ కాదన్నారు. ఒక హీరో ఇంకో హీరోతో సినిమా తీస్తున్నప్పుడు ఎన్నో రకాల కాంప్లికేషన్స్ వస్తాయని, వాటన్నింటినీ ఛాలెంజ్‌గా తీసుకుని నాని సక్సెస్ అవుతున్నారని మెచ్చుకున్నారు. గతంలో ‘హిట్’ సిరీస్, మొన్న ‘కోర్ట్’, ఇప్పుడు ‘అలియాస్ రుక్మిణి’ ఇలా నాని ఎంచుకుంటున్న కథలే ఆయనకు విజయాలు అందిస్తున్నాయన్నారు. డైరెక్టర్ మురళితో పాటు యంగ్ టీమ్ అంతా కలిసి చేసిన ఈ సినిమా డిసెంబర్ 4న పెద్ద హిట్ అవుతుందని దిల్ రాజు విశ్వాసం వ్యక్తం చేశారు.

