టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల వ్యవస్థను శాసించగలరు నిర్మాత దిల్ రాజు. రెండు తెలుగు రాష్ట్రాలలో స్టార్ హీరోల సినిమాల దగ్గర నుండి డెబ్యూ సినిమా హీరో వరకు ఎవరి సినిమా రిలీజ్ అయిన సరే svc స్టాంప్ ఉండాల్సిందే ఆ విధంగా సాగేది దిల్ రాజు హావ. కానీ ఇదంతా గతం. అవును ఇదంతా ఒకప్పటి మాట.
Also Read: Nani: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని & శనివారం టీమ్..
ఒకప్పుడు నైజాం కింగ్ గా దిల్ రాజు పేరు. కానీ ఇప్పుడు ఫీల్డ్ లోకి మైత్రీ మూవీస్ అనే నిర్మాణ సంస్థ దిగింది. ఒకప్పుడు మైత్రీ సినిమాలు కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. పుష్ప తర్వాత ఎందుకనో మైత్రీ సొంతగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు నైజాంలో బడా సినిమాలు దగ్గర నుండి చిన్న సినిమాల వరకు అని మైత్రీమూవీస్ డిస్ట్రిబ్యూషన్ కె వెళ్తున్నాయి. చాలా రోజుల తర్వాత దిల్ చేతికి ఓ స్టార్ హీరో సినిమా వచ్చింది అదే నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం. Dvv దానయ్య నిర్మించిన ఈ సినిమాను దిల్ రాజు పంపిణిసి చేస్తున్నాడు. మరోవైపు డబ్బింగ్ సినిమాలను ఏషియన్ సురేష్ సంస్థ పంపిణి చేస్తోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ఒకటి అరా సినిమాలతో నెట్టుకొస్తోంది. డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన ఉత్సహంతో మైత్రీ మరో ఆడగు ముందుకేసి థియేటర్ల బిజినెస్ లోకి ఎంటర్ అయింది. ఆ వ్యవస్థలో కూడా మైత్రీ దూసుకువెళ్ళడం ఖాయం.