NTV Telugu Site icon

Upasana Surrogacy: ఉపాసన బిడ్డను కనబోయేది సరోగసి ద్వారానా?

Upasana1

Upasana1

upasana-about-having-a-child-through-surrogacy: మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ రెండు రోజులు ముందే మెగాస్టార్ చిరంజీవి అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హట్ టాపిక్. పదేశళ్లుగా ఆ వార్త కోసం ఎదురుచూస్తున్న మోగా ఫాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అయితే త్వరలోనే తమ మెగా వారసుడు రాబోతున్నాడని, మరో మెగాస్టార్‌ లాంటి టాలెంట్‌ ఉన్న హీరోఇండస్ట్రీలోకి వస్తాడని ఫాన్స్‌ ఆశపడుతున్నారు. అయితే ఈ తరుణంలో ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో ఒక్కసారిగా మెగా ఫాన్స్‌ ఆశలను తలకిందులు చేసాయి. అయితే ఆమె నాచురల్‌ గా గర్భం దాల్చలేదని, సరోగసి ప్రాసెస్‌ ద్వారా కనబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఉపాసన ప్రెగ్నెంట్‌ అంటూ చెప్పిన కొన్ని నిమిషాల ముందే ఆమె కార్‌ రేసింగ్‌ దగ్గర ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Read also: Rahul Gandhi : రాహుల్ భారత్‌ జోడో యాత్ర @ 100 రోజులు.. హిట్టా.. ఫట్టా

మోగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్‌ అయితే అత్తమామలు అలా ఎలా వదిలేస్తారు.. వదిలేయలేరుకదా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంత కేరింగ్‌ గా ఉన్న ఫస్ట్ ట్రైమిస్టర్‌ లో జాగ్రత్తగా ఉండాలి కాదా.. అలాంటప్పుడు ఉపాసన అంత ఫ్రీగా వదిలేయడం ఏంటి? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా వదిలేసినా.. ఇప్పుడు సెలబ్రెటీలు అందరూ సరోగసి ద్వారా పిల్లలను కనడం కొత్త విషయం ఏమీకాదు. ఇదివరకు ఎంతోమంది ఈరకంగా సరోగసీ ద్వారా తల్లులు అయ్యారు. వాళ్లందరూ ఫిలిం ఇండస్ర్టీలో ఉన్నావరే.. మంచు లక్ష్మీ దగ్గర నుంచి నిన్నగాక మొన్న పెళ్లయిన నయనతార వరకు ఎందరో సెలబ్రెటీరు ఇలా తల్లులైన వారే.

దీనినే సెలబ్రెటీస్‌ అందరూ చూస్‌ చేసుకుంటున్నారు. ఇదే సరోగసీ ప్రాసెస్‌ ని ఉపాసన చూస్‌ చేసుకుందని, మొదటి నుండి సరోగసి ప్రాసెస్‌ ద్వారానే బిడ్డలను కనడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈవార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఈవార్తపై మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా రెస్పాండ్‌ అవ్వాలి. ఈ న్యూస్‌ కు పుల్‌స్టాప్‌ పెట్టాలంటే మెగాస్టార్‌ చిరంజీవి గానీ.. రామ్‌ చరణ్ గానీ రియాక్ట్‌ అయ్యి ఫేక్‌ న్యూస్‌ అంటూ చెబితే గాని మెగా అభిమానులు ఊపిరి పీల్చుకోలేరు. అయితే ఏది ఏమైనా సరే ఉపాసన ప్రెగ్నంట్‌ అయితే ఒక తలనొప్పి.. ప్రెగ్నెంట్‌ కాలేకపోతే మరో తలనొప్పి.. టోటల్‌ గా మెగా వారసుడు ఇండస్ర్టీలోకి రాకముందే సినిమా ఇండస్ర్టీని షేక్‌ చేసేస్తున్నాడనేది మాత్రం వాస్తవమే!
U19 T20 World Cup: ఇది అమెరికా జట్టా? భారత్-బి జట్టా?