Site icon NTV Telugu

Diamond Dacoit Challenge: హుక్ స్టెప్‌ వేయండి, లక్ష పట్టండి.. వినూత్నంగా మూవీ ప్రమోషన్స్!

Diamond Dacoit Movie Promotions

Diamond Dacoit Movie Promotions

హైదరాబాద్‌లో ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని పార్ధ గోపాల్ నిర్మించగా.. దర్శకుడు సూర్య జి యాదవ్ దర్శకత్వం వహించారు. పార్ధ గోపాల్, మేఘనా జంటగా నటిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య హాజరై.. ప్రముఖ మ్యూజిక్ సంస్థ మధుర ఆడియో ద్వారా పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమాపై విశేషాలు పంచుకుంటూ.. పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేసింది.

Also Read: Chicken Price Hike: నాన్‌వెజ్ ప్రియులకు భారీ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి చికెన్ ధరలు!

ప్రేక్షకులను ఆకర్షించేందుకు ‘డైమండ్ డెకాయిట్ చిత్రబృందం ఓ వినూత్న పోటీని కూడా ప్రకటించింది. ‘మరదలివే’ పాటకు హుక్ స్టెప్ ఛాలెంజ్‌ను ప్రకటిస్తూ.. ఆసక్తిగలవారు ఆ పాటకు డాన్స్ చేసి రీల్స్ రూపంలో వీడియోలు చేసి వాట్సాప్ నంబర్ 8074801661కు పంపవచ్చని చెప్పింది. ఈ పోటీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ఆకర్షణీయ బహుమతులు కూడా ప్రకటించారు. మొదటి బహుమతిగా రూ.1 లక్ష, రెండవ బహుమతిగా రూ.50 వేల నగదు అందించనున్నట్లు తెలిపారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించామని చిత్ర యూనిట్ వెల్లడించింది. మొత్తంగా డైమండ్ డెకాయిట్ ఆడియో రిలీజ్ కార్యక్రమం, హుక్ స్టెప్ ఛాలెంజ్ ప్రకటనతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది.

Exit mobile version