Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar: బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టి, ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ధురంధర్’కు సెన్సార్ బోర్డు గట్టి ఝలక్ ఇచ్చింది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంలో ఏకంగా 50 సీన్లను తొలగించాలంటూ సెన్సార్ బోర్డు ఆదేశాలు జారీ చేయడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిలీజై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఉన్నట్టుండి మళ్లీ సెన్సార్ కత్తెరకు ఎందుకు బలవ్వాల్సి వచ్చిందనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రాల్లో ‘ధురంధర్: ది రివెంజ్’ను త్వరలోనే బుల్లితెరపై ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఇందులోని మితిమీరిన హింస, తీవ్రమైన సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. రూల్స్ ప్రకారం ‘A’ సర్టిఫికెట్ ఉన్న చిత్రాలను నేరుగా టెలివిజన్‌లో ప్రసారం చేయడానికి నిబంధనలు అంగీకరించవు.
ఈ క్రమంలో కుటుంబ ప్రేక్షకులకు అనుగుణంగా బుల్లితెరపై ప్రసారం చేసేందుకు మేకర్స్ ఈ చిత్రాన్ని మరోసారి సెన్సార్ బోర్డు పునఃపరిశీలనకు పంపారు. చిత్రాన్ని వీక్షించిన బోర్డు సభ్యులు.. సాధారణ టీవీ వీక్షకులకు, చిన్నపిల్లలకు ఇబ్బంది కలిగించేలా ఉన్న సుమారు 45 నుంచి 50 కీలక సన్నివేశాలను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. బోర్డు సూచించిన మార్పులు, చేర్పులన్నీ పూర్తి చేసిన తర్వాతనే దీనికి ‘U/A 16+’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ భారీ కత్తెర్ల కారణంగా చిత్ర అసలు రన్‌టైమ్ దాదాపు 10 నిమిషాల మేర తగ్గిపోయినట్లు సమాచారం. అన్ని అడ్డంకులు పూర్తి కావడంతో అక్టోబర్ 18న ఈ చిత్రాన్ని ‘స్టార్ గోల్డ్’ ఛానల్లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. థియేటర్లలో తీవ్రమైన హింసతో రచ్చలేపిన ఈ సినిమా, సెన్సార్ కత్తెర్ల అనంతరం టెలివిజన్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
తాజావార్తలు
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!