Site icon NTV Telugu

Dhurandhar Collections: ‘ధురంధర్’ 50 రోజులు పూర్తి.. కమర్షియల్‌ సినిమాల లిస్ట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌!

Dhurandhar 50 Days Collections

Dhurandhar 50 Days Collections

రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్‌ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. విడుదలై 50 రోజులు పూర్తయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల వేగం తగ్గలేదు. రికార్డ్ బ్రేకింగ్‌ రూ.886.05 కోట్ల నెట్‌ కలెక్షన్‌ సాధించి.. భారతీయ సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. జియో స్టూడియోస్‌, B62 స్టూడియోస్‌ నిర్మించిన ధురంధర్ చిత్రం కమర్షియల్‌ సినిమాల లిస్ట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేసింది. వారం వారీగా చూస్తే ‘ధురంధర్’ ప్రదర్శన ఎంత స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుస్తోంది.

తొలి వారం నుంచే బాక్సాఫీస్‌ను దద్దరిల్లించిన ధురంధర్.. ప్రతి వారం భారీ మొత్తాలను రాబట్టి రికార్డులను తిరగరాసింది. మొదటి వారం రూ.218 కోట్లు, రెండో వారం రూ.261.50 కోట్లు వసూలు చేసి అంచనాలను మించిపోయింది. మూడో వారం కూడా జోరు కొనసాగిస్తూ రూ.189.30 కోట్లు సాధించింది. నాలుగో వారం రూ.115.70 కోట్లు, ఐదో వారం రూ.56.35 కోట్లు, ఆరో వారం రూ.28.95 కోట్లు, ఏడో వారం రూ.16.25 కోట్లు రాబట్టింది. మొత్తంగా 50 రోజుల్లోనే రూ.886.05 కోట్ల నెట్‌ కలెక్షన్‌ నమోదు చేసింది.

Also Read: Motorola Signature Launch: 5200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా.. ప్రీమియం లుక్‌తో వచ్చేసిన మోటో సిగ్నేచర్‌!

ధురంధర్ లైఫ్‌టైమ్‌ కలెక్షన్ల విషయానికి వస్తే.. భారత్‌లోనే రూ.892 నుంచి రూ.895 కోట్ల వరకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ పలు థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీతో ప్రదర్శితమవుతుండటంతో త్వరలోనే మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రణ్‌వీర్‌ సింగ్‌ కెరీర్‌లోనే ధురంధర్ ఒక మైలురాయిగా నిలిచింది. కథ, కథనంతో పాటు భారీ నిర్మాణ విలువలు, మాస్‌ అపీల్‌.. అన్ని కలిపి ధురంధర్‌ను బాక్సాఫీస్‌ మాన్‌స్టర్‌గా మార్చాయి. మొత్తంగా.. ధురంధర్ 50 రోజుల రన్‌తో భారత సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

 

Exit mobile version