అక్షయ్ ఖన్నా, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ చిత్రాలను వెనక్కి నెట్టి.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిందీలో మాత్రమే విడుదలైనప్పటికీ.. వరుసగా పలు వారాల పాటు రూ.20 కోట్లకు పైగా (సుమారు $200 మిలియన్లు) వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణ భారతదేశంలో కూడా ధురంధర్ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. మౌత్ టాక్, సోషల్ మీడియా ట్రెండ్స్ ఈ సినిమాను పాన్-ఇండియా మూవీగా మార్చాయి. ఈ భారీ విజయంతో మేకర్స్ పెద్ద ప్లాన్ వేశారు.
డిసెంబర్ 5న హిందీలో విడుదలైన ధురంధర్ చిత్రం 2025లోనే బిగ్గెస్ట్ ఇండియన్ హిట్‌గా నిలిచింది. ధురంధర్ విజయంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ధురంధర్-2’ను 2026న ఈద్ సందర్భంగా మార్చి 19 విడుదల చేస్తున్నట్లు మేకర్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. దక్షిణాదిలోని పంపిణీదారులు, ప్రేక్షకుల డిమాండ్‌ను గుర్తించిన నిర్మాతలు ధురంధర్-2 ను మొదటి రోజే నాలుగు ప్రధాన ప్రాంతీయ భాషలలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ధురంధర్ సీక్వెల్ విడుదల కానుంది.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేటితో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ!
2026 ఈద్ సందర్భంగా విడుదల కానున్న ధురంధర్-2.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా రణ్‌వీర్ సింగ్ స్టార్ పవర్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యం. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా.. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో రణ్‌వీర్ గూఢచారి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆయన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ లాంటి స్టార్స్ పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. ధురంధర్ 20 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.935 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ధురంధర్-2 ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
