Site icon NTV Telugu

Dhurandhar 2 Breaks Pushpa 2 Records: ‘ధురందర్ 2’ సునామీ.. కొట్టుకుపోయిన ‘పుష్ప 2’ ఆల్-టైమ్ రికార్డు..

Dhurandhar 2 Breaks Pushpa

Dhurandhar 2 Breaks Pushpa

Dhurandhar 2 Breaks Pushpa 2 Records: బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్’ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. వరల్డ్‌వైడ్‌గా ఆ మూవీ రూ.1,300 కోట్లకు పైగా వసూలు చేయగా.. ఇప్పుడు సీక్వెల్‌గా వచ్చిన ధురందర్‌ 2 కూడా.. వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.. ఫస్ట్ డేనే ఏకంగా రూ. 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి రికార్డుల వేట మొదలుపెట్టింది. బాక్సాఫీస్‌లో సంచలనాన్ని సృష్టించిన ‘ధురందర్ 2’.. ఈ చిత్రం ఇప్పటికే పుష్ప 2 సృష్టించిన హిందీ సినిమా ఆల్-టైమ్ ఓపెనింగ్ రికార్డును అధిగమించడంతో, బాలీవుడ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది..

పెద్ద రికార్డు, భారీ వసూళ్లు
‘పుష్ప 2’ హిందీ వర్షన్ మొదటి రోజులో రూ.72 కోట్ల వసూలు చేసింది… అయితే, ‘ధురందర్ 2’ ఇప్పటికే రూ.75 కోట్లకు పైగా వసూలు చేసి, పుష్ప 2 రికార్డును అధిగమించింది. గురువారం మొత్తం వసూళ్లు రూ.100 కోట్ల దాక చేరే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.. థియేటర్ల బయట చెక్-ఇన్ లైన్లు, హౌస్‌ఫుల్ షోలు, రికార్డ్ స్థాయిలో టికెట్ అమ్మకాలు జరుగుతున్నాయి.. విమర్శకుల సమీక్షలు, ప్రచారం సినిమా వసూళ్లు పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి..

ప్రపంచ స్థాయి క్రేజ్
‘ధురందర్ 2’ కేవలం ఓ సినిమా కాదు. ఇది ఒక పెద్ద పాప్ కల్చర్ ఈవెంట్. బాహుబలి 2 తర్వాత ఈ స్థాయిలో క్రేజ్ చూడటం అరుదు. బాలీవుడ్‌లో మునుపెన్నడూ చూడని రికార్డులు సాధించడానికి ఇది సిద్దంగా ఉందని చెప్పుకోవచ్చు.. అతిపెద్ద హిందీ ఓపెనింగ్ రికార్డును సృష్టించిన ‘ధురందర్ 2’, రాబోయే రోజుల్లో 100 కోట్లు హిందీ వసూలు సాధించే అవకాశం ఉంది. ప్రేక్షకుల ఉత్సాహం కొనసాగితే, ఇది పుష్ప 2 కంటే కూడా ఎక్కువ క్రేజ్ మరియు వసూలు సాధించే సినిమా అవుతుంది అంటున్నారు..

Exit mobile version