Dhurandhar 2 Box Office Collection: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోన్న ‘ధురంధర్ 2’.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2 Box Office Collection: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి చేరి రికార్డులు సృష్టించింది. రూ.1,000 కోట్ల మార్క్‌ను చేరిన భారతీయ చిత్రాల్లో ‘పుష్ప 2’ సరసన చేరింది.. సాక్నిల్క్ నివేదికల ప్రకారం, ఈ చిత్రం 7వ రోజు (బుధవారం) రూ.47.7 కోట్లు వసూలు చేసింది. దేశవ్యాప్తంగా 20,000కు పైగా షోల ద్వారా ఈ వసూళ్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇండియా నెట్ కలెక్షన్ రూ.623.42 కోట్లు కాగా, గ్రాస్ కలెక్షన్ రూ.744.58 కోట్లకు చేరింది. విదేశీ మార్కెట్లలో రూ.261.92 కోట్లు వసూలు చేసి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.1006.5 కోట్ల గ్రాస్‌ను అందుకుంది.
Read Also: Donald Trump: “నాకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని ఆఫర్ చేశారు.. కానీ”.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Katrina - Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
- Karthi-Suriya: కార్తీ, సూర్య.. వెయిట్ చేస్తూనే ఉంటారా?, హోప్స్ వదిలేసుకుంటారా?
- Ramayana Movie Piracy: 'రామాయణ: పార్ట్ 1' మూవీ పైరసీ.. ఇక థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేస్తే క్రిమినల్ కేసే..!
- Allu Arjun: అల్లు అర్జున్‌కు తప్పనున్న తిప్పలు!
ఈ చిత్రం త్వరలోనే కల్కి 2898 AD (రూ.1042 కోట్లు) కలెక్షన్లను దాటే అవకాశముంది. అలాగే, జవాన్ (రూ.1160 కోట్లు) లైఫ్‌టైమ్ రికార్డును కూడా చేరుకునే దిశగా దూసుకెళ్తోంది. ‘ధురంధర్ 2’ ప్రివ్యూ షోల ద్వారా మొదటి రోజే రూ.43 కోట్లు వసూలు చేసి భారీ ఓపెనింగ్ సాధించింది. మొదటి రోజు రూ.102.55 కోట్లు రాబట్టగా, రెండో రోజు రూ.80.72 కోట్లకు తగ్గింది. అయితే, వీకెండ్లో మళ్లీ జోరు పెంచి శనివారం రూ.113 కోట్లు, ఆదివారం రూ.114.85 కోట్లు వసూలు చేసింది. తర్వాత రోజుల్లో సోమవారం రూ.65 కోట్లు, మంగళవారం రూ.56.60 కోట్లు, బుధవారం రూ.47.70 కోట్లు రాబట్టింది.
ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు.. ఇందులో రణవీర్ సింగ్ అండర్‌కవర్ గూఢచారి పాత్రలో కనిపిస్తున్నారు. అండర్‌వరల్డ్‌లో జరుగుతున్న గూఢచారి ఆపరేషన్ నేపథ్యంలో కథ సాగుతుంది. మొదటి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్లో ట్విస్ట్‌లతో మిషన్‌ను పూర్తి చేయడం ప్రధానాంశంగా సాగింది.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను కొనసాగిస్తున్న ఈ సినిమా త్వరలోనే దేశీయంగా కూడా రూ.1,000 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
-
Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!