Donald Trump: “నాకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని ఆఫర్ చేశారు.. కానీ”.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటనలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. తాను ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నానని, యుద్ధాన్ని త్వరగా ముగించడానికి ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఇటీవల పేర్కొన్నారు. అయితే, ట్రంప్ వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ గందరగోళం నడుమ అందరి దృష్టిని ఆకర్షించే మరో ప్రకటన చేశారు. కొంతమంది ఇరానీయులు తనకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. తాను నవ్వి, “నేను నిరాకరించాను. ప్రపంచంలో ఏ నాయకుడూ ఇరాన్ సర్వోన్నత నాయకుడు కావాలని కోరుకోడు” అని బదులిచ్చినట్లు చెప్పారు.
READ MORE: Vivo V70 FE: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. వివో V70 FE రిలీజ్ కు రెడీ
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా ఇరాన్‌ను పూర్తిగా ఓడించిందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. “ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడని విజయాన్ని మనం సాధిస్తున్నాం. ఇరాన్ ఇప్పుడు చాలా త్వరగా ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటోంది. కానీ ఇరాన్ చాలా భయపడుతోంది. ఒకవేళ ఒప్పందానికి వస్తే సొంత ప్రజలే ఇరాన్‌ను నాశనం చేస్తారని అది భయపడుతోంది. ఈ తరుణంలో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని, హిజ్బుల్లా వంటి గ్రూపులకు మద్దతు ఇవ్వడం ఆపాలని, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ అమెరికా ఇరాన్‌కు 15-సూత్రాల ప్రతిపాదనను పంపింది.” అని ట్రంప్ చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తనకు ఇరాన్ సుప్రీం లీడర్‌గా అవకాశం వచ్చిందన్న వాదనలపై ఇంకా ఇరాన్ స్పందించలేదు.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!