Site icon NTV Telugu

85 ఏళ్ల వయస్సులో… ధర్మేంద్ర ‘రోమాంటిక్ రోల్’కి రెడీ!

కరణ్ జోహర్ దర్శకత్వంలో సినిమా అనగానే బాలీవుడ్ లో సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. నిర్మాతగా ఆయన బోలెడు సినిమాలు ప్రకటిస్తుంటాడు. స్వంతంగా నిర్మించేవి, ఇతర బ్యానర్స్ తో కలసి ప్రొడ్యూస్ చేసేవి… ఇవి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి కేజో ఖాతాలో. అయితే, ఆయన డైరెక్షన్ చేయటం మాత్రం కొంత అరుదే. ఈ మధ్య కాలంలో సినిమాకి, సినిమాకి మధ్య గ్యాప్ అంతకంతకూ పెంచేస్తున్నాడు. ఆయన లాస్ట్ మూవీ ‘యే దిల్ హై ముష్కిల్’ విడుదలై 5 ఏళ్లు పూర్తైంది. మళ్లీ ఇంత లాంగ్ గ్యాప్ తరువాత ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’తో కరణ్ మెగాఫోన్ పడుతున్నాడు!
రణవీర్, ఆలియా జంటగా కరణ్ తన నెక్ట్స్ రొమాంటిక్ కామెడీ మనకు అందించబోతున్నాడు. అయితే, ఈ మల్టీ స్టారర్ లో అసలు సర్ ప్రైజ్ లెజెండ్రీ యాక్టర్స్ ధర్మేంద్ర, జయా బచ్చన్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. అందుక్కారణం… 85 ఏళ్ల మన ‘హీ-మ్యాన్’ ధర్మేంద్ర తాజాగా చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్టే!
ధరమ్ పాజీ ఒకప్పుడు రొమాంటిక్ హీరో. ఆయన సినిమాల్లో అద్భుతమైన ప్రేమ కథలుండేవి. రొమాంటిక్ సాంగ్స్ కి కూడా ధర్మేంద్ర బోలెడు ఫేమస్. అటువంటి ఐకాన్ ఇప్పుడు కరణ్ జోహర్ లాంటి దర్శకుడి సినిమాతో కమ్ బ్యాక్ చేయనున్నాడు. అంతే కాదు, ఆయనే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో తనది రొమాంటిక్ రోల్ అంటూ హింట్ కూడా ఇచ్చాడు! అందుకే, ఇప్పుడు ఆయనకు, జయా బచ్చన్ కు మధ్య ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంది!
ధర్మేంద్ర, జయ బచ్చన్ కాకుండా కరణ్ జోహర్ నెక్ట్స్ వెంచర్ లో షబానీ ఆజ్మీ కూడా కనిపించనుంది. ఈ సీనియర్ నటీనటుల నడుమ రణవీర్, ఆలియా యంగ్ అండ్ స్పైసీ లవ్ స్టోరీ యూత్ ను ఫుల్ గా అలరిస్తుంది అంటున్నారు! చూడాలి మరి తనకు అచ్చొచ్చిన రొమాన్స్ జానర్ లో డైరెక్టర్ కేజో ఎలాంటి థ్రిల్ కలిగిస్తాడో…

Exit mobile version