తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘ఇడ్లీ కడాయి’ ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసి, రిలీజ్‌కు రెడీ అయింది. నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించగా, అదనంగా, అరుణ్ విజయ్, సత్యరాజ్, షాలినీ పాండే, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ గ్రాండ్ గా అక్టోబర్ 1న విడుదల కానుంది.ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విశేష అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఈ ఆసక్తిని మరింత పెంచింది. ఇందులో భాగంగా..
తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకోగా.. ‘యూ’ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ బోర్డు ఇచ్చిన క్లియర్ సర్టిఫికెట్ ప్రకారం, కంటెంట్ సబ్జెక్ట్ అన్ని వయసుల ప్రేక్షకులు చూడదగినది. చిత్ర యూనిట్ ప్రకారం, కథ, ఎంటర్టైన్మెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులకి సరిపోతాయి. అందుకే యూ’ సర్టిఫికెట్ ఇచ్చారు. కాగా ఈ మూవీని ధనుష్ కాస్త స్లోగానే చేసినట్లు అనిపిస్తుంది. ఈ మూవీ మధ్యలో ఉండగా జాబిలమ్మ నీకు అంత కోపమా ప్రాజెక్టుని ఫినిష్ చేశాడు. మళ్లీ ఇడ్లీ కడై సెట్‌లోకి వచ్చాడు. తిరు చిత్రం తర్వాత మళ్లీ ధనుష్, నిత్యా మీనన్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ అవ్వడంతో అందరిలోనూ అంచనాలు పెరిగాయి. ఇక ఇది కూడా ఓ సెన్సిబుల్ స్టోరీ అని తెలుస్తోంది.