Dhanush-Mammootty: మమ్ముట్టి సర్.. మరోసారి ఇలా రాకండి ప్లీజ్.. ధనుష్ కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush Funny Comments on Mammootty: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఓం’. సాయిపల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ నెల 20న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మమ్ముట్టిని ఉద్దేశించి ఆయన చేసిన సరదా కామెంట్స్ అందరినీ నవ్వించాయి.
‘ఓం ద్విభాషా చిత్రం. ఇందులోని సంభాషణల్లో దాదాపు 30 శాతం తెలుగులోనే ఉంటాయి. ముఖ్యంగా సాయిపల్లవి పాత్రతో పాటు మరికొన్ని కీలక పాత్రలు తెలుగులోనే మాట్లాడతారు. తిరుమల, తిరువణ్ణామలై వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో కథ సాగుతుంది. తెరపై కనిపించే భావోద్వేగాల కంటే సినిమా వెనుక ఉన్న భావం చాలా లోతైనది. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అందరికీ మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఈ సినిమా కోసం దర్శకుడు, నిర్మాత శ్రద్ధా ఎంతో కష్టపడ్డారు. సినిమా మేకర్స్ విజన్‌ను అర్థం చేసుకుని సరైన నటీనటులను ఎంపిక చేసిన నిర్మాతలకు కూడా సగం క్రెడిట్ దక్కుతుంది. ఇందులో చాలామంది తెలుగు నటులు భాగమయ్యారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు’ అని ధనుష్ చెప్పారు.
Also Read
- Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
- Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
- OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
మమ్ముట్టితో కలిసి నటించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ధనుష్ తెలిపారు. ఆయనతో పనిచేసిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. అనంతరం మమ్ముట్టిని ఉద్దేశించి సరదాగా మాట్లాడుతూ.. ‘మమ్ముట్టి సర్.. మీకో చిన్న విజ్ఞప్తి. మరోసారి ఏదైనా ఈవెంట్‌కు వచ్చినప్పుడు ఇలా గ్లామర్‌గా రాకండి . నాలాగే మెరిసిన గడ్డంతో రండి. జనాలు నన్ను మీ అన్న అనుకుంటున్నారు. మీరు నాకంటే చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు’ అని చమత్కరించారు. దీంతో ఈవెంట్లో నవ్వులు పూశాయి. అలాగే నటి రేణు దేశాయ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆమె తమిళం చాలా బాగుందని ప్రశంసించారు. ఆమెతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా అనిపించిందని ధనుష్ పేర్కొన్నారు.
‘ఓం’ ఒక సంక్లిష్టమైన కథతో తెరకెక్కిందని, తెలుగు ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని ధనుష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 20న విడుదల కానున్న తన సినిమాతో పాటు అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్న దుల్కర్ సల్మాన్ చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ కూడా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రీ రిలీజ్ వేడుకలో మమ్ముట్టిపై ధనుష్ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.
తాజావార్తలు
-
Dhanush-Mammootty: మమ్ముట్టి సర్.. మరోసారి ఇలా రాకండి ప్లీజ్.. ధనుష్ కామెంట్స్ వైరల్!
-
ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ పదవులపై ఉత్కంఠ.. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇంకా రాని క్లారిటీ..!
-
Electric Shock: విద్యుత్ తీగ తగిలి విద్యార్థిని మృతి, మరో బాలికకు గాయాలు..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
AP Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. నేటితో నామినేషన్లకు తెర
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!