Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Dhanush

Dhanush

Om: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కాంబోలో రాబోతున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం ‘ఓం’ (Om). దసరా పండుగ సీజన్‌‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న బాక్సాఫీస్ బరిలోకి దిగాల్సిన ఈ విజువల్ వండర్‌ను వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో ధనుష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన సరికొత్త అధికారిక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ‘ఓం’ నవంబర్ 20వ తేదీన థియేటర్లలోకి తీసుకురానున్నారు. రెండు భాగాలుగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రానికి ‘అమరన్’ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సొంతం చేసుకున్న రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తుండటం ప్రధాన ఆకర్షణగా మారింది. ధనుష్, మమ్ముట్టిల యాక్షన్ సీక్వెన్స్‌‌లు తెరపై తీవ్ర ఉత్కంఠను రేకెత్తించనున్నాయి. వీరితో పాటు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా, మలయాళ నటుడు ఇంద్రన్స్ అత్యంత కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ వాయిదాతో నేచురల్ బ్యూటీ సాయిపల్లవికి అరుదైన అవకాశం దక్కింది. దీపావళి కానుకగా ఆమె నటించిన భారీ చిత్రం ‘రామాయణ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మరుసటి నెలే అంటే నవంబర్ 20న ‘ఓం’ కూడా థియేటర్లలోకి అడుగుపెట్టనుండటంతో.. బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ పాన్-ఇండియా రిలీజ్‌లతో బాక్సాఫీస్‌‌పై సాయిపల్లవి హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్‌, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఆర్.కలైవానన్ ఎడిటర్‌గా, కె.ఎళిల్‌ అరసు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 20న బాక్సాఫీస్ వద్ద ‘ఓం’ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో వేచి చూడాలి.