Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Om: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కాంబోలో రాబోతున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం ‘ఓం’ (Om). దసరా పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న బాక్సాఫీస్ బరిలోకి దిగాల్సిన ఈ విజువల్ వండర్‌ను వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో ధనుష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన సరికొత్త అధికారిక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ‘ఓం’ నవంబర్ 20వ తేదీన థియేటర్లలోకి తీసుకురానున్నారు. రెండు భాగాలుగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఈ చిత్రానికి ‘అమరన్’ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సొంతం చేసుకున్న రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తుండటం ప్రధాన ఆకర్షణగా మారింది. ధనుష్, మమ్ముట్టిల యాక్షన్ సీక్వెన్స్‌లు తెరపై తీవ్ర ఉత్కంఠను రేకెత్తించనున్నాయి. వీరితో పాటు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా, మలయాళ నటుడు ఇంద్రన్స్ అత్యంత కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ వాయిదాతో నేచురల్ బ్యూటీ సాయిపల్లవికి అరుదైన అవకాశం దక్కింది. దీపావళి కానుకగా ఆమె నటించిన భారీ చిత్రం ‘రామాయణ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మరుసటి నెలే అంటే నవంబర్ 20న ‘ఓం’ కూడా థియేటర్లలోకి అడుగుపెట్టనుండటంతో.. బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ పాన్-ఇండియా రిలీజ్‌లతో బాక్సాఫీస్‌పై సాయిపల్లవి హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఆర్.కలైవానన్ ఎడిటర్‌గా, కె.ఎళిల్ అరసు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 20న బాక్సాఫీస్ వద్ద ‘ఓం’ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో వేచి చూడాలి.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
The Day for the Ultimate Strike is Here 💥#OM Hits theatres worldwide on November 20, 2026.
A @Rajkumar_KP Film.@dhanushkraja @mammukka @Sai_Pallavi92 @RTakeStudios @wunderbarfilms @SaiAbhyankkar #NaseeruddinShah @sreeleela14 @Shra2309 @azy905 @theSreyas @sandy_sashr… pic.twitter.com/I5GBoL4HJT
— Wunderbar Films (@wunderbarfilms) October 2, 2026
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!