Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush), మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు (Mamitha Baiju) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘కర’ (Kara). థియేటర్లలో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై రచ్చ చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకోగా.. రాబోయే మే 28 నుండి ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
‘పోరుతొజిల్’ లాంటి మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను అందించిన టాలీవుడ్ అండ్ కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ విఘ్నేష్ రాజా (Vignesh Raja) ఈ చిత్రాన్ని అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. ఈ సినిమాలో సీనియర్ డైరెక్టర్ కే.ఎస్. రవికుమార్, పృథ్వీరాజన్, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. ఎమోషన్స్, లవ్ అండ్ బ్యాంక్ రాబరీ (బ్యాంక్ దొంగతనం) బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా కథ ఆడియన్స్‌ను ఇంట్రెస్టింగ్ రైడ్‌కు తీసుకెళ్తుంది.
Also Read
- Kajal Aggarwal: స్టోరీల ఎంపికపై కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్.. ఆ ఒక్కరి కోసమే కథలు మారుస్తోందట!
- Romanchakam Glimpse: జానకి చెంతనే రాముడి హృదయం.. సందీప్ వంగా 'రోమాంచకం' గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ ఉందిగా!
- Akhil Akkineni: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్‌పై కన్నేసిన అఖిల్ అక్కినేని.. మైండ్‌లో పెద్ద స్కెచ్చే ఉందిగా!
- Naga Vamsi: పర్సంటేజ్ సిస్టమ్ వెనుక కుట్ర! థియేటర్ల మోసాలను బయటపెట్టిన నిర్మాత నాగవంశీ..
కథ విషయానికి వస్తే.. కరస్వామి (ధనుష్) ఒక ప్రొఫెషనల్ దొంగ. కానీ, తాను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి (మమితా బైజు) కోసం ఆ నేర జీవితాన్ని వదిలేసి, బుద్ధిగా కష్టపడి బతకాలని నిర్ణయించుకుంటాడు. భార్యతో కలిసి ఒక హోటల్ పెట్టాలనేది అతని కల. హోటల్ బిజినెస్ పెట్టుబడి కోసం తన ఊరిలో ఉన్న పొలం కాగితాలను బ్యాంకులో తాకట్టు పెట్టాలని ప్లాన్ చేస్తాడు. ఆ పట్టా కాగితాల కోసమే ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉంటున్న తన తండ్రి (కేఎస్ రవికుమార్) దగ్గరకు వెళ్తాడు. కానీ, అక్కడే సీన్ రివర్స్ అవుతుంది. ఊహించని కొన్ని ఘోర పరిణామాల వల్ల కర తన కళ్ల ముందే తండ్రిని కోల్పోతాడు. అసలు కర తన తండ్రికి ఎందుకు అన్ని ఏళ్లు దూరంగా ఉన్నాడు? ముత్తు సెల్వన్ బ్యాంకులను మాత్రమే అతను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు? చివరికి తన భార్య మల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని హోటల్ పెట్టగలిగాడా లేదా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ ‘కర’ సినిమా.
తాజావార్తలు
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
-
Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
-
Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!