చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా మారిన దేవిశ్రీ ప్రసాద్, అతి తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే, దేవిశ్రీ ప్రసాద్‌కి ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఆయన పవన్ కళ్యాణ్తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తప్పితే, దేవిశ్రీ ప్రసాద్ మార్క్ సినిమా ఒకటి కూడా ఆయన లిస్టులో లేదనే చెప్పాలి. వాస్తవానికి, ‘పుష్ప 2’ సినిమా చేస్తున్నప్పుడు కూడా, ఆ ఒక్క సినిమానే ఆయనకు పెద్ద బ్రాండ్‌లా ఉండేది. కానీ, ‘పుష్ప’ దర్శక నిర్మాతలతో ఏర్పడిన వివాదం ఏకంగా స్టేజ్ మీద మాట్లాడుకునే వరకు వచ్చేయడంతో, ఇప్పుడు ఇతర దర్శక నిర్మాతలు దేవిశ్రీ ప్రసాద్‌ను హైర్ చేసుకునేందుకు వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
Also Read : Deepika Padukone: హీరో, హీరోయిన్ ఒక్కటేనా? దీపికా!
ఒకపక్క సంగీతం అనగానే తెలుగులో తమన్, ఆ తర్వాత అనిరుద్, ఇప్పుడు కొత్తగా హర్షవర్ధన్ రామేశ్వర్ లాంటి సంగీత దర్శకులను పెట్టుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక తర్వాత బీమ్స్ లాంటి తర్వాతి తరం సంగీత దర్శకులు సైతం అందుబాటులోకి వచ్చేసారు. ఈ నేపథ్యంలో, దేవిశ్రీ ప్రసాద్ మార్కెట్ కాస్త డల్ అయినట్లుగానే కనిపిస్తోంది. దానికి తోడు, పుష్ప వివాదంతో ఆయనను తీసుకునేందుకు దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తున్నట్లుగా చెప్పొచ్చు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ ఇమేజ్ మార్చుకోకుంటే, రాబోయే కాలం కాస్త ఇబ్బందికరమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్న సంగీత దర్శకుడికి ఇప్పుడు ఆఫర్స్ తగ్గిన, సరైన కాంబినేషన్ సెట్ అయితే, మరోసారి దుమ్ము రేపడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు.
