భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘రాక్‌స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ (DSP) ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు. సంగీత దర్శకుడిగా వందలాది సినిమాలకు చార్ట్‌బస్టర్ సాంగ్స్ అందించిన ఆయన.. ఇప్పుడు కథానాయకుడిగా (హీరోగా) వెండితెరకు పరిచయమవుతున్నారు. దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ డ్రామా చిత్రానికి ‘ఎల్లమ్మ’ (Yellamma) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.
టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఎల్దండి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పక్కా జానపద, దైవిక, గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్-ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. అయితే తాజాగా డిఎస్‌పి తన స్వగ్రామాన్ని సందర్శించి.. అసలు తాను హీరోగా ‘ఎల్లమ్మ’ సినిమా చేయడానికి గల బలమైన స్ఫూర్తిని ఒక ప్రత్యేక వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల దేవిశ్రీ తన తూర్పుగోదావరి జిల్లాలోని తన స్వగ్రామమైన వెదురుపాకును సందర్శించారు. అక్కడ జరిగిన ఊరి జాతర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన..
‘మా నాన్నగారు జన్మించిన పవిత్రమైన ఊరు వెదురుపాక. ప్రకృతి అందాలు, పల్లెటూరి జీవన సౌందర్యం, మన సంస్కృతి గురించి మాకు తెలియాలని నాన్న మమ్మల్ని చిన్నప్పుడు తరచూ చెన్నై నుంచి ఇక్కడికి తీసుకువచ్చేవారు. మా సొంత ఊరి మనుషులతో, మా మూలాలతో అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలనే ఉద్దేశంతో వెదురుపాకలోనే మేము ఒక అందమైన ఇల్లు కూడా నిర్మించుకున్నాం. మన దేశీయ సంస్కృతి, జానపద కళలు (Folk Arts), దైవత్వం ఎంత గొప్పవో, ఎంత అందమైనవో నాకు ప్రాక్టికల్‌గా నేర్పిన ఊరు ఇదే. వెదురుపాక ఊరి జాతరలో కనిపించే ఆ దైవిక శక్తి, జానపద కళల నేపథ్యమే నన్ను కథానాయకుడిగా మార్చింది. ఆ పల్లెటూరి అనుభూతులు, నా చిన్ననాటి జ్ఞాపకాలే నేను ‘ఎల్లమ్మ’ సినిమా అంగీకరించడానికి, ఈ పాత్ర చేయడానికి ప్రధాన స్ఫూర్తినిచ్చాయి’ అని డిఎస్‌పి భావోద్వేగానికి గురయ్యారు.
అని దేవిశ్రీప్రసాద్ స్పష్టం చేశారు.
