NTV Telugu Site icon

Devara : ట్రోలింగ్ టూ రికార్డు బ్రేకింగ్.. NTR కి మాత్రమే చెల్లింది..

Untitled Design 2024 08 13t122806.318

Untitled Design 2024 08 13t122806.318

దేవర సినిమా నుండి రిలీజైన రెండు పాటలు కాపీ మ్యూజిక్ ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అనిరుద్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడుద‌లైన ‘చుట్టమల్లే..’ పాట అయితే వేరే లెవల్ ట్రోలింగ్‌కు గురైంది. ఇప్పుడు అదే పాట స‌రికొత్త రికార్డును నాంది ప‌లికింది. చుట్ట‌మ‌ల్లే.. సాంగ్ ఇప్పుడు ఏకంగా 80 మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది. లిరిక‌ల్ సాంగ్స్ వ్యూస్ ప‌రంగా  అత్యధిక వ్యూస్ సాధించి రెండో స్థానంలో  దేవర సెకండ్ సాంగ్ నిలిచింది.

Also Read : Rebal Star: కల్కి సినిమా ఇంకా చూడలేదా..? అయితే ఇక్కడ చూసేయండి..

ఫాస్టెస్ట్  50 మిలియ‌న్ వ్యూస్‌ను రాబట్టిన  లిరిక‌ల్ సాంగ్స్ లిస్టులో తొలి స్థానం ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించి బీస్ట్ సినిమాలోని హ‌ల‌మ‌తి హ‌బీబో సాంగ్‌కి ద‌క్కింది. నాలుగు రోజుల్లోనే ఈ పాట యాబై మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టుకోవ‌టం విశేషం. ఆ  త‌ర్వాత స్థానంలో దేవ‌ర నుంచి చుట్ట‌మ‌ల్లే సాంగ్ నిలిచింది. ఇది 6 రోజుల్లో ఈ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను క్రాస్ చేసింది. సాంగ్ రిలీజైన రోజు దారుణమైన ట్రోలింగ్ గురైంది చుట్టమల్లే సాంగ్. శ్రీలంకన్ మ్యుజిషియాన్ సాంగ్ లోని మ్యూజిక్ మక్కికి మక్కి దింపేసినట్టు వీడియోలను జతచేస్తూ సోషల్ మీడియాలో ట్రోలర్స్ హంగామా సృష్టించారు. వాటన్నిటిని దాటి చుట్టమల్లే సాంగ్ అత్యిధిక వ్యూస్ రాబట్టింది.  ఇక మూడో స్థానంలో పుష్ప ది రైజ్ చిత్రం నుంచి ఊ అంటావా మావ‌.. సాంగ్ 9 రోజుల్లో యాబై మిలియ‌న్ వ్యూస్ మార్క్‌ను దాటింది.

Also Read : Sridevi: సెల్యులాయిడ్ పై చెక్కుచెదరని ‘అతిలోక సుందరి శ్రీదేవి’ అభినయం..

ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబోలో రూపొందుతోన్న దేవ‌ర‌ రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. దేవ‌ర‌ పార్ట్ – 1 సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ కానుంది. సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ మూవీకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో భారీ అంచ‌నాల‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె సినిమాను నిర్మిస్తున్నారు.

Show comments