NTV Telugu Site icon

DevaraTrailer : దేవర.. రికార్డుల జాతర.. ఇప్పటికి ఎన్ని మిలియన్ వ్యూస్ అంటే..?

Untitled Design (19)

Untitled Design (19)

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, సూపర్ హిట్ చిత్రాల దర్శకూడు కొరటాల శివ కలయికలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Also Read : KiranAbbavaram : కిరణ్ అబ్బవరం ‘క’ రిలీజ్ ఎప్పుడంటే.. రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ హీరో..?

కాగా దేవర ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి మిలియన్ వ్యూస్ రాబడుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుత స్పందన రాబట్టింది. తారక్ స్క్రీన్ ప్రెజన్స్, డైలాగ్ డెలివరీ,విజువల్ ఫీస్ట్ అందించాయి. మరి ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే షార్క్ తో ఎన్టీయార్ పోరాడే సీన్ మొత్తం ట్రైలర్ కే హైలెట్ గ నిలిచింది అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటివరకు దేవర 35 మిలియన్ వ్యూస్ రాబట్టి గ్లోబల్ లెవల్ లో ట్రేండింగ్ లో ఉంది. య్యుట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్ సినిమాల సరసన దేవర టాప్ లి నిలిచింది. మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ సేల్స్ బుకింగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ రెబల్స్ రీసెంట్ హిట్స్ కల్కి, సలార్ అడ్వాన్స్ సేల్స్ ను క్రాస్ చేసింది. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ప్రీమియర్స్ ను తెల్లవారుజామున 1.08 గంటలకు ప్రదర్శించనున్నారు.