NTV Telugu Site icon

Devara : ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

Untitled Design 2024 08 14t074038.277

Untitled Design 2024 08 14t074038.277

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ఇది వరకే అధికారకంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Aslo Read : Tollywood : వారిద్దరికి హిట్టు తప్పనిసరి.. లేదంటే ఇబ్బంది తప్పదు..

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెట్స్ నుంచి ఓ ఫొటోను తాజాగా ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దేవర పార్ట్ 1 కోసం నా చివరి షాట్‌ను ముగించాను. ఇది ఎంత అద్భుతమైన ప్రయాణం, సముద్రమంత ప్రేమను, అధ్బుతమైన టీమ్ ను ఇక మిస్ అవుతాను,సెప్టెంబర్ 27 న దర్శకుడు కొరటాల శివ చేతిలో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమాని సెప్టెంబర్ 27న చూడటానికి ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేసారు. దాంతో పాటుగా తారక్, కొరటాల శివ ఉన్న దేవర సెట్స్ లోని ఫోటోను జత చేసాడు దేవర. ఈ పోస్ట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చివరి దశ షూటింగ్ ముగించి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడు తారక్. మరికొద్ది రోజుల్లోనే దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు నిర్మాత కళ్యాణ్ రామ్.

Show comments