మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ విజువల్ వండర్ ‘దేవర: పార్ట్ 1’ శాటిలైట్ హక్కులకు సంబంధించిన సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. థియేటర్లలో మరియు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సెన్సేషనల్ వ్యూయర్‌షిప్‌తో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా ఆసక్తికరంగా మారిన ‘దేవర’ తెలుగు శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ అయింది.
తాజా సమాచారం ప్రకారం ప్రముఖ టెలివిజన్ నెట్‌వర్క్ ఈటీవీ ‘దేవర’ చిత్ర శాటిలైట్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. సాధారణంగా భారీ కమర్షియల్ మరియు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల కొనుగోలుకు కాస్త దూరంగా ఉండే ఈటీవీ ఈ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమా కోసం భారీ డీల్ కుదుర్చుకోవడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ రెండేళ్ల పాటు ఈ సినిమాకు సంబంధించి అన్ని రైట్స్ తమకే చెందుతాయని ఒప్పందం నిబంధనల వల్లే ఇప్పటివరకు ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ ఆలస్యమైంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎట్టకేలకు ఈటీవీ లాంటి భారీ నెట్‌వర్క్‌లో ‘దేవర’ టెలివిజన్ ప్రీమియర్‌కు రంగం సిద్ధం కావడంతో, బుల్లితెరపై తారక్ ‘దేవర’ తాండవం ఖాయమని, సరికొత్త టీఆర్పీ రికార్డులు నమోదు కావడం పక్కా అని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
