NTV Telugu Site icon

Devara : నేను దేవర సినిమా చూసాను.. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది: అనిరుధ్

Untitled Design (26)

Untitled Design (26)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక దేవర ఆగమనానికి సర్వం సిద్ధమయ్యింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోలు రానున్న వేళ అభిమానులు థియేటర్లను ముస్తాబు చేసి పండగ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు.  దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా వస్తున్న కానుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక థియేటర్ల వద్ద తమ అభిమాన హీరో కటౌట్లను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు అభిమానులు. సెప్టెంబర్ ప్రారంభం నుంచి దేవర గురించి వరుస అప్డేట్లతో సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశారు . జైలర్ వంటి సూపర్ హిట్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన  అనిరుధ్ దేవరకు సంగీతం అందించాడు.

Also Read : Harsha Sai : పరారిలో యూట్యూబర్ హర్ష సాయి.. గాలింపు చర్యలు ముమ్మరం

తాజాగా దేవర టీమ్ ఓ  ఇంటర్వ్యూ నిర్వహించింది. దర్శకుడు కొరటాల శివ, అనిరుధ్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, సాబూసిరిల్ పాల్గొన్నారు. కాగా ఈ ఇంటార్వ్యూలో అనిరుధ్ దేవర సినిమా గురించి మాట్లాడుతూ  ” దేవర’ హాలీవుడ్  రేంజ్ లో ఉంటుంది, నేను ఈ సినిమా హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో  ఫ్యాన్స్ తో కలిసి చూడాలని ఉంది. శివ గారు లైన్ చెప్పినప్పుడు ఇది వేరే లెవల్ అని ఊహించాను, ఈ సినిమాకు నేను సంగీతం చేయాలి అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. చుట్టమల్లె సాంగ్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది, అసలు    ‘ ఇంత గొప్ప సినిమాను ఎలా రూపొందించారా అని ఆశ్చర్యమేస్తోంది.  దేవర చూస్తున్నప్పుడు  హాలీవుడ్ సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా నేను చూసాను బ్లాక్ బస్టర్ సాదిస్తుంది” అని అన్నారు.