NTV Telugu Site icon

Devara : దేవర ‘రన్ టైమ్’ అన్ని గంటలంటే కాస్త కష్టమే సుమీ..

Untitled Design (14)

Untitled Design (14)

జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషలలో రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవర గ్లిమ్స్ రిలీజ్ చేసిన నాటి నుండి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవల రిలీజ్ చేసిన చుట్టమల్లే సెకండ్ సాంగ్ 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి ఆ అంచనాలు ఇంకాస్త పెంచింది.

Also Read: Tollywood : వరద భాదితులకు అండగా టాలీవుడ్.. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే..?

ప్రస్తుతం షూటింగ్ ముగించుకున్న దేవర సెప్టెంబరు 27 న అత్యంత భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం రన్ టైమ్ తారక్ అభిమానులను కాస్త ఆందోళననకు గురి చేస్తోంది. దేవర మొత్తంగా 3 గంటల 10 నిమిషాల రన్ టైమ్ తో రానుంది. అంత నిడివి అంటే కాస్తంత ఇబ్బందే అని చెప్పక తప్పదు. భారతీయుడు – 2, అంటే.. సుందరానికి, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు దాదాపు 3 గంటల వ్యవధితో వచ్చి ఫ్లాప్ గా మిగిలాయి. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తూ సినిమాను నడిపితే తప్ప కొంచం అటు ఇటు అయిన ఆడియన్స్ తిప్పికొడతారు. అదే ఇప్పుడు ఎన్టీయార్ ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. కానీ దేవర ఇంకా  సెన్సార్ జరగలేదని అది అయ్యకే ఫైనల్ రన్ టైమ్ లాక్ చేస్తారని యూనిట్ సభ్యుల టాక్. మరోవైపు ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో  సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొనుగోలు చేసారు. అటు ఆంధ్ర ఇటు తెలంగాణాలో తెల్లవారు జామున 1:00 గంటలకు ప్రీమియర్స్ వేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Show comments