NTV Telugu Site icon

Devara : ఓటీటీలోనూ అదరగొడుతున్న దేవర

Devara

Devara

యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన  దేవర సూపర్ గా నిలిచింది. సెప్టెంబరు 27న రిలీజ్ అయిన దేవర మరికొద్ది రోజుల్లో 50రోజలు పూర్తి చేసుకోనుంది. అర్ద శతదినోత్సవం వేడుకలను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికి దేవర డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే రిలీజ్ కాబడిన అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Also Read : Zeebra : మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా ఆ హీరో సినిమా ట్రైలర్ లాంఛ్

దేవర డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. నవంబరు 8న డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన దేవర సూపర్ రెస్పాన్స్ రాబడుతోంది. మిలియన్ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది దేవర. తాజగా ఈ వీక్ ఇండియా టాప్ టెన్ సినిమాల లిస్ట్ విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్. ఓటీటీలో రిలీజ్ అయిన నాటి నుండి ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ NO. 1 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతు టాప్ లో సాగుతోంది దేవర. దేవర జూనియర్ ఎన్టీఆర్ కనబరిచిన నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచి రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన తారక్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేసిన దేవర ఇప్పుడు ఓటీటీలోను రికార్డు వ్యూస్ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.

Show comments