NTV Telugu Site icon

Devara: దేవర బెన్ ఫిట్ షో టికెట్ ‘ధర’ తెలిస్తే.. గుండె దడపుట్టాల్సిందే..

Untitled Design (30)

Untitled Design (30)

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరవుతున్న నేపథ్యంలో ‘దేవర’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా చేస్తున్నారు నిర్మాతలు.

Also Read: Devara : దేవర డబుల్ షేడ్ చూసారా.. ఇక్కడ చూసేయండి..

కాగా దేవర చిత్రాన్ని ఓవర్శిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి  షోస్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు రైట్స్ కొనుగులు చేసిన నాగవంశీ. సెప్టెంబరు 27న తెల్లవారు జామున 1.08 గంటలకు బెన్ ఫిట్ షో లు రెండు తెలుగు రాష్ట్రాలలోసెలక్టెడ్ థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. అయితే ఈ ప్రీమియర్ షోస్ టికెట్ ధర వింటే మతిపోవాల్సిదే ఎవరికైనా. నైజాంలోని ప్రముఖ థియేటర్స్ సుదర్శన్, భ్రమరాంభ మల్లికార్జున, శ్రీరాములు, విమల్ వంటి సింగిల్ స్క్రీన్స్ లో దేవర ప్రీమియర్ టికెట్ ధర అక్షరాల 2000 రూపాయలు. అవును మీరు చదివింది నిజమే. రిలీజ్ కు నెల ముందే టికెట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ నాగవంశీకి తాకిడి ఎక్కువగా ఉంది. సోలో రిలీజ్ కావడం, భారీ హైప్ తో రాబోతున్న దేవర ఎటువంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కలేనా రామ్, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర బాలీవుడ్ హక్కులను కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు.

Show comments