NTV Telugu Site icon

Devara : ఓవర్సీస్ లో దేవర దండయాత్ర.. ఆచార్య ఫుల్ రన్ అవుట్..

Untitled Design (2)

Untitled Design (2)

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన ఇండియాస్ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ఎంతో కసిగా ఈ గట్టి కంబ్యాక్ ఇచ్చి విమర్శకుల నోర్లు మూపించాలని శపధం పూని దేవరను పకడ్బందీగా తెరకెక్కించాడు. ఇప్పటికె విడుదల అయిన గ్లిమ్స్ ఆకట్టుకోగా ఈ చిత్రంలోని మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబటట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది

Also Read: GOAT : విజయ్ GOAT 4 డేస్ కలెక్షన్స్.. అక్కడ నిండా మునిగిన ఎగ్జిబిటర్లు..

కాగా దేవర ఒవర్సీస్ అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ బ్రేకుల్లేని బులెట్ ట్రైన్ లా వెళుతోంది. . నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో దేవర $1.1 మిలియన్ రాబట్టి దూసుకెళుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలో కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా 1 మిలియన్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా దేవర రికార్డు క్రియేట్ చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొరటాల శివ గత దర్శకత్వం వహించిన బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ ఆచార్య  నార్త్ అమెరికా ఫుల్ రన్ ($985K) ను దేవర రిలీజ్ కు 17 రోజులు ఉండగానే దాటేసింది. రిలీజ్ నాటికి దేవర అడ్వాన్సు బుకింగ్స్ 3 మిలియన్ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ రోజు సాయంత్రం 5.04 గంటలకు ముంబై లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామున 1.08 గంటలకు ప్రీమియర్స్  వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.

Show comments